సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయుటకు ప్రత్యామ్నాయ పనులు నిరంతరాయంగా చేపట్టాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని, పని విభజన చేయడం వల్ల జాప్యానికి తావు లేకుండా నిరంతరాయంగా జరుగుతుంటాయని ఆయన స్పష్టం చేశారు.
కలెక్టరేట్ సరిహద్దు చుట్టూ అందమైన మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.
కలెక్టరేట్ సముదాయంలోని ఖాళీ ప్రదేశాన్ని అందమైన మొక్కలతో పాటు ఫాంటేన్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కలెక్టరేట్ నిర్మాణ పనులల్లో ఇప్పటికే కాలయాపన జరిగిందని ఇకముందు కాలయాపన జరగడానికి వీల్లేదని పనులు ముమ్మరంగా జరుగుతుండాలని ఆయన స్పష్టం చేశారు.
కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ఉన్న లేఅవుట్ల దారులను గుర్తించి నివేదికలు సమర్పించాలని నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
వర్షపునీరు బయటికి వెళ్లకుండా నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు.
త్రాగునీటి నిలువకు బ్యాంకుల ఏర్పాట్ల నిర్మాణాలను ప్రణాళికా బద్దంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్ నిర్మాణంతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఇతర జిల్లా అధికారుల నివాస గృహాల నిర్మాణ పనులను కలెక్టరేట్ నిర్మాణ పనులతో పాటే పూర్తి చేయాలని చెప్పారు.
నిర్మాణ పనులు వేగంగా జరిగేలా కూలీల సంఖ్య పెంచుతూ నిరంతరంగా పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు
నూతన కలెక్టరేట్ సముదాయంలో జరుగుతున్న అధికారుల ఛాంబర్లు సమావేశ మందిరాల నిర్మాణ పనులను తనకు ముందస్తుగా చూపించాలని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏప్రిల్ మాసం వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని జాప్యం కావడానికి వీల్లేదని చెప్పారు. పనులు ముమ్మరంగా జరిగేందుకు వీలుగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందచేయాలని కలెక్టరేట్ సముదాయ ప్రాజెక్టు డిజియంకు సూచించారు.
ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పనులు జాప్యం కాకుండా ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
కలెక్టరేట్, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారుల గృహ సముదాయాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, షెడ్యూలు ప్రకారం పనులు జరగాలని చెప్పారు. కార్యాలయ ఆవరణ పరిసరాల్లో జరుగుతున్న పనులు కలెక్టర్ అధికారిక నివాస గృహా సముదాయాలకు ప్రహారీగోడ నిర్మించేందుకు నిర్మాణానికి అయ్యే వ్యయపు అంచనా నివేదికలు సత్వరం అందచేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ భాస్కర్, డిఈ రమాదేవి, డిపిఆర్ కంపెనీ ప్రాజెక్టు డిజియం ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఏఈ మహేష్ సైట్ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.

Share This Post