సమీకృత కలెక్టరేట్ భవనం ఐ.డి.ఓ.సి. సెప్టెంబర్ మాసము వరకు పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్ చౌరస్తా వద్ద కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సందర్శించారు. భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. హెలిప్యాడ్, కలెక్టర్ ఛాంబర్, సమావేశ హాల్ తదితర గదులను పరిశీలించారు. సమావేశ హాల్లొ రిసౌండ్ రాకుండా ముందస్తుగా ధ్వని శోషణ చేసే సీలింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సౌండ్ సిస్టమ్ కొరకు రేడియో ఇంజనీర్, ఎస్.ఈ సమన్వయంతో పని చేసి అత్యుత్తమ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత లో లోపం లేకుండా చేయాలని ఆదేశించారు.
ఆర్.అండ్ బి. ఇఇ. భాస్కర్, డి.ఈ. రమాదేవి , మున్సిపల్ కమిషనర్ నగేష్, కాంట్రాక్టర్, ఇంజనీర్లు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.