సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం మ్యాప్‌, భవన నిర్మాణ పనుల పరిశీలన. రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.

మంగళవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌) స్థలాన్ని, నిర్మాణ పనులను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. క్రిష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ ,ఎస్పీ గౌస్‌ అలం లతో కలసి పరిశీలించారు.

అనంతరం భవన నిర్మాణ స్థలం మ్యాప్‌ను పరిశీలించి ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశమై కాంప్లెక్స్‌ నిర్మాణ ప్రత్యేకతలను మంత్రి సత్యవతి రాథోడ్ తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్,
ఆర్ అండ్ బి డి ఈ, రఘువీర్, ములుగు తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post