సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పక్షం రోజుల్లో పూర్తి చేయాలి

పత్రిక ప్రకటన
తేది :05.11.2022
నిర్మల్ జిల్లా శనివారం

సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పక్షం రోజుల్లో పూర్తి చేయాలి

జిల్లా పాలనాధికారి
ముష ర్రఫ్ ఫారుఖీ.

ప్రభుత్వం ప్రతిస్థాత్మకంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం లో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించాలనే ఉద్దేశం తో జిల్లాలో చేపట్టిన సమికృత భవన నిర్మాణ పనులను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల నుండి ప్రజలు పొందే సేవలను సమీకృత కలెక్టరేట్ ద్వారా ఒకే చోట ప్రజలకు సేవలు అందించవచ్చని తెలిపారు. సమీకృత కలెక్టరేట్ భవన మెయిన్ గేటు, ప్రహరీ గోడ, వైరింగ్ ఇతరత్రా అన్ని నిర్మాణ పనులను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో రెవిన్యూ డివిజనల్ అధికారి తుకారామ్, mro శుభాష్ చందర్, అర్ అండ్ బి అశోక్, ఇంజనీర్ అధికారులు, తదితరులు ఉన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post