సమీకృత కార్యాలయాల సముదాయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు.
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రశంసాపత్రాలు బహూకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతిక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఐఎఎస్ కదివరన్ ఫలనీ, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.