సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి.ఎం.ఎఫ్.టి. సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన      తేది:22.09.2022, వనపర్తి

త్రాగునీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, వృద్ధుల, వికలాంగుల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, పారిశుద్ధ్యం అభివృద్ధికి అత్యవసర నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి మంత్రి డి.ఎం.ఎఫ్.టి. సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రూ. 6 కోట్ల 94 లక్షలు నిధులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.1కోటి 18 లక్షల విలువ కలిగిన నిధులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాలో 7 మండలాలకు గాను  కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలకు, . తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణకు, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, వృద్ధుల, వికలాంగుల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, పారిశుద్ధ్యం తదితర విభాగాలకు నిధులను కేటాయించినట్లు,  అత్యవసర పరిస్థితులలో ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సిపిఓ వెంకటరమణ, డీఎఫ్ఓ రామకృష్ణ, పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య, ఆర్ అండ్ బి ఈ ఈ దేశ్య నాయక్, డి ఎం హెచ్ ఓ, డి పి ఓ,  ఎస్సీ అధికారిని నుషిత, డిసిఒ, డిటిడిఓ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post