సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
Dt:4.8. 2021
వనపర్తి

ఆగస్టు 15 లోపు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం పనులను పూర్తి చేసి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
బుధవారం వనపర్తి లోని నూతన కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 కన్న ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం కొరకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ నెల 15 లోపు కార్యాలయ పనులు పూర్తిచేసి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. అలాగే200/3 సర్వే నంబర్ లో 50 ఎకరాల స్థలాన్ని మెడికల్ కళాశాలకు పరిశీలించారు. మెడికల్ కళాశాల స్థలంలో 80 ఫీట్ రోడ్డు ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 15లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం, మెడికల్ కళాశాల శంకుస్థాపన ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్నది అని మంత్రి తెలిపారు. పాల శీతలీకరణ కేంద్రం ప్రక్కన గొర్రెల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అటవీ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయనైనది.

Share This Post