సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జిల్లా సంక్షేమ అధికారి

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 2: డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దివ్యాంగులకు సమాన అవకాశాలు అనే అంశంపై దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, విశిష్ట అతిథులుగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొననున్నట్లు, జిల్లా అధికారులు హాజరవనున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమం ఉదయం 11.00 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంక్షేమ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post