సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రభుత్వ విభాగాల గదులను పరిశీలించిన అదనపు కలెక్టర్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, జనవరి, 28: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వివిధ ప్రభుత్వ విభాగాల గదులను జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పౌర సరఫరాలు, రహదారులు & భవనాలు, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ, ఉపాధి కల్పన శాఖ, తదితర శాఖలకు కేటాయించిన గదులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏదైనా మరమ్మతులు చేసుకోవాలని అనుకుంటే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గార్ల అనుమతి పొందిన తర్వాత పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.
అదనపు కలెక్టర్ పరిశీలనలో ఆయన వెంట ఆర్ & బి ఈఈ కిషన్ రావు,కలెక్టరేట్ ఏఓ గంగయ్య, తదితరులు ఉన్నారు.

Share This Post