పత్రిక ప్రకటన
తేదీ : 15–08–2022
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పనులు ఏమాత్రం పెండింగ్ ఉండకుండా అన్నీ పూర్తి చేయాలి
ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి
జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ హరీశ్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో షామీర్పేటలోని అంతాయిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రారంభించనున్న నేపథ్యంలో పనులు ఏమాత్రం పెండింగ్లో ఉండకుండా అన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాలాల సముదాయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా సమీకృత భవనం రూ.56.20 కోట్లతో ముప్పై ఎకరాల్లో నిర్మిస్తున్నందున పనులు పూర్తి చేసి బుధవారం నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు అన్ని రకాలుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో అన్ని గదులను తిరిగి పరిశీలించి పనులు ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అనే వివరాలను ఆర్ అండ్ బీ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. దీనికి సంబంధించి ఒకే రోజు సమయం ఉన్నందున పనులు ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా పూర్తి చేయాల్సందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ హరీశ్ పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సభ ఉన్నందున వర్షం కురిసినా సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. వర్షం పడినప్పటికీ ఇబ్బందిలేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్ , ఇంటలీజెన్స్ ఎస్పీ ఎన్.వి. కృష్ణారావు, బాలానగర్ డీసీపీ సందీప్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, జిల్లా అధికారులు ,మున్సిపల్ కమిషనర్లు, ఆయ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.