సమీకృత మార్కెట్లను వేగవంతంగా పూర్తి చేయాలి

సమీకృత  మార్కెట్లను వేగవంతంగా పూర్తి చేయాలి

రోడ్ల మీద వ్యాపారం చేసే వారిని  మార్కెట్లకు తరలించాలి

కరీంనగర్- సిరిసిల్ల రోడ్డు 80 కోట్లతో పూర్తి చేస్తున్నాం త్వరలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు

కమాన్ నుండి ఎన్టీఆర్ చౌక్ వరకు రోడ్డుకు ఫుట్ పాత్ కు మధ్య మట్టిని తొలగించాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

     జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కరీంనగర్ చొప్పదండి జమ్మికుంట హుజరాబాద్ కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు, డీఈ లు, ఏఈ లతో సమీకృత మార్కెట్ల నిర్మాణం, ఫుట్ పాత్ ల ఆక్రమణలు, హరితహారం, ఐలాండ్, రానున్న వర్షాకాలంలో చేపట్టవలసిన చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కరీంనగర్, జమ్మికుంట హుజరాబాద్, చొప్పదండి,కొత్తపల్లి పట్టణాలలో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  వర్ష  కాలంలో  మురికినీటి కాలువల నీరు బిటి రోడ్లపై ప్రవహించడం వల్ల రోడ్లు పాడై పోతున్నాయి అని మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలన్నారు. . కరీంనగర్ సిరిసిల్ల రోడ్డు 80 కోట్ల తో రోడ్డు పూర్తి చేస్తున్నామని, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేల ఎన్టీఆర్ విగ్రహం నుండి కమాన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మెయిన్ ఎంట్రన్స్ అద్భుతంగా  తీర్చిదిద్దేలా  చర్యలు చేపట్టాలన్నారు. గుత్తేదారులు సమీకృత మార్కెట్ల ను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఐలాండ్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల వద్ద  పార్కింగ్ సమస్య  తలెత్తకుండా  చూడాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామం లను జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని మంత్రి అన్నారు

     ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రంట్ ఇరువైపులా మొక్కలు నాటాలి అన్నారు. హుడా అనుమతిలేకుండా మానేరు రివర్ ఫ్రంట్ సమీపంలో ఎటువంటి నిర్మాణాలు సుడా అనుమతిలేకుండా చేపట్టరాదని అన్నారు. మానే రివర్ ఫ్రంట్ ప్రక్కన అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేయాలన్నారు. హైదరాబాద్, ఉప్పల్ తర్వాత కరీంనగర్ జిల్లాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయుటకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన తెలిపారు.

     ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్ రావు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అదనపు కలెక్టర్ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జమ్మికుంట హుజురాబాద్ చొప్పదండి కొత్తపల్లి  మున్సిపల్ కమిషనర్లు డీఈ లు ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post