సమీకృత మార్కెట్, ఆడిటోరియం నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆగష్టు 12, 2021ఆదిలాబాదు:-

సమీకృత మార్కెట్, ఆడిటోరియం నిర్మాణాలకు కావలసిన భూములను సంబంధిత అధికారులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో అదనపు కలెక్టర్లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాత్నాల క్వార్ట్రర్స్ లో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణాలకు కావలసిన భూమిని ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో భూ సేకరణను చేపట్టాలని, అందుకు కావలసిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలనీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి హామీ మేరకు ఆదిలాబాద్ లో మూడు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆడిటోరియం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ అన్నారు. ఇట్టి పనులు ప్రాధాన్యత సంతరించుకున్నందున అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థల పరిశీలనకు జాయింట్ సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, మున్సిపల్ కమీషనర్ శైలజ, ఇరిగేషన్ ఎస్ఈ పి.రాము, ఈఈ విట్టల్ రాథోడ్, మున్సిపల్, ఇరిగేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post