సమీకృత మార్కెట్ నిర్మాణానికి త్వరిత గతిన చర్యలు చేపట్టండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 13, 2021ఆదిలాబాదు:-

సమీకృత మార్కెట్ నిర్మాణానికి త్వరిత గతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున స్థానిక సాత్నాల క్వార్ట్రర్స్ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ స్థల పరిశీలనను కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా మార్కెట్ నిర్మాణ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మ్యాప్ ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ మార్గాలను, ఆయా స్థలంలో నిర్మించబడి ఉన్న భవనాలను పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతం, వెజ్, నాన్-వెజ్, తదితర నిర్మాణాల వివరాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, మున్సిపల్ కమీషనర్ శైలజ, ఇరిగేషన్ ఈఈ విట్టల్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post