సమీకృత మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

సమీకృత మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

కల్వకుర్తి పట్టణంలో మునిసిపాలిటీ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసేందుకు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించేందుకు  సమీకృత మార్కెట్‌ యార్డుకు కావలసిన సర్వే నెంబర్ 21, 22 లోని రెండు ఎకరాల స్థలాన్ని శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పరిశీలించారు.   మునిసిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్‌ కమిషనర్ తో సమీక్షించారు. పట్టణంలో మార్కెట్‌ యార్డు నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం     సమీకృత మార్కెట్‌ యార్డు ఏర్పాట్లకు చాలా అనువైన స్థలంగా అభిప్రాయపడ్డారు.

ఒకే చోట కూరగా యలు, మాంసాహార ఉత్పత్తులు, చేపల విక్రయా లు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా విక్రయాలు జరుగుతాయని, వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, ఆర్డిఓ రాజేష్ కుమార్, వైస్ చైర్మన్ షాహెద్, తహసీల్దార్‌ రామ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యాడ్డ్ కార్యదర్శి భగవంతు మున్సిపల్ మేనేజర్ రాజకుమారి సర్వేర్ అమీనుద్దిన్  పాల్గొన్నారు.

Share This Post