సమీకృత వెజ్ – నాన్ వెజ్ మార్కెట్లను త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

సమీకృత వెజ్ – నాన్ వెజ్ మార్కెట్లను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000


     సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

     5వ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం చొప్పదండి పట్టణంలో క్రీడా ప్రాంగణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, చొక్కా రావు వ్యవసాయ మార్కెట్ యార్డ్, సమీకృత వెజ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత వెజ్ నాన్వెజ్ మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో నీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రైనేజ్ లను ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు క్రీడా ప్రాంగణం పరిశీలించారు. శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనమును పరిశీలించి పలు సూచనలు చేశారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజా భూమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరేపల్లి చంద్రశేఖర్ , జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post