సమీకృత వ్యవసాయ విధానంలో భాగంగా రైతు విజ్ఞాన యాత్రను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్

జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కల సాగు కై రైతు విజ్ఞాన యాత్రకు బయలుదేరిన జిల్లా రైతులు, వ్యవసాయ అధికారులు.

జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచనల మేరకు జిల్లాలో రైతులు సమీకృత వ్యవసాయ విధానం అభివృద్ధి చేయడంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బొడుప్పల్ లో రైతులు సాగు చేస్తున్న ఔషధ మొక్కలు, సుగంధ పంట సాగు పై  నారాయణపేట జిల్లా రైతులకు అవగాహన కల్పించేందుకు  చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం జిల్లాలోని ఆసక్తి గల  రైతులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో బొడుప్పల్ లోని సుగంధ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు   దామరగిద్ద, మద్దూర్, నారాయణపేట,  ధన్వాడ మండలాల రైతులను, సంబంధిత ఏ.ఈ.ఓ లను రైతు విజ్ఞాన ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కల పెంపకం పై రైతు విజ్ఞాన యాత్ర CSIR-CIMAP Bod Uppal హైదరాబాద్ కు RTC బస్సు లో బయలుదేరారు.   అదనపు డిఆర్డీఓ,   జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు.

Share This Post