సమైక్య స్ఫూర్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువుటద్దం – అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

స్వాతంత్ర్యానంతరం భారతదేశాన్ని సమైక్య పరిచి ఎన్నో సంస్థానాలను విలీనం చేసిన స్పూర్తి ప్రదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కొనియాడారు.

ఆయన జయంతి రోజున జాతీయ ఏక్తా దివస్ నిర్వహించుకుంటున్న సంగతి విదితమే. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి వేడుకలను నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకోవడము సంతోషంగా ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నారు.
భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని, భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ.నెహ్రూ తోటి స్వాతంత్ర్యం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించారని, వీరి ఆలోచనలు, ఆచరణలు భావితరాలకును ముందుకు తీసుకు వెళ్లడానికి దిక్సూచిగా ఉపయోగపడుతున్నాయని, పటేల్ ఆశయాలు మనకు ఆచరణీయమని, భారత సమాజానికి ఎంతో ఉపకరించేవని పేర్కొన్నారు. మనము ఉద్యోగ ధర్మంలో సమాజానికి మన వంతు సేవ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వారితో
దేశ ఐక్యమత్యం పై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో సి పి ఓ శ్రీనివాసులు, డి డబ్ల్యూ ఓ ఝాన్సీ లక్ష్మి, ఏవో సుదర్శన్, మైనార్టీ వెల్ఫేర్ ఇన్చార్జి అధికారి రతన్ రాథోడ్, సూపర్డెంట్ రషీద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Share This Post