సమ్మక్క సారలమ్మ.జాతర పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్


సమక్క –సారలమ్మల జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయండి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహణ
జాతర నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జనవరి 7:- జిల్లాలో నిర్వహించే సమక్క-సారలమ్మల జాతరకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున జాతర ఏర్పాట్ల పై సింగరేణి కాలరిస్,ఎన్టిపిసి ,రామగుండం మున్సిపాలిటి, సమక్క-సారలమ్మ బోర్డ్ మెంబర్లతో రామగుండం ఎమ్మెల్యే తో కలిసి తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గోదావరిఖని, ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమక్క – సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు రెండు ప్రాంతాలలో జాతర నిర్వహించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నదం కావాలని అన్నారు. జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు అందించుటకు శాశ్వత పైప్ లైన్, రిస్కు టీంలు, ఐరన్ బార్కెట్ల సరఫరా,హుండిల తయారి, జాతర గ్రౌండ్ విద్యుత్ సరఫరా అలంకరణ, మట్టిని ముంపు ప్రదేశం మొత్తం చదును చేయడం వంటి ఏర్పాట్లను సింగరేణి కాలరిస్ సిద్దం చేయాలని తెలిపారు. సింగరేణి కాలరీస్ జనవరి 26 లోపు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమక్క-సారలమ్మల గద్దెలు మరమత్తు చేయటం, నిర్మించటం, ప్రహారి గోడకు రంగులు వేయటం, మొక్కుబడి ఓడిబియ్యం భక్తులు వేయుటకు 25 డ్రమ్ముల ఎర్పాటు ఎన్టిపిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూసుకోవాలని తెలిపారు. ఎన్టిపీసి సంస్థకు కేటాయించిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదేశించారు. ఎన్టిపీసి సంస్థ నిధులు విడుదల చేయాలని, సదరు పనులను మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ గా వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు. జాతర సందర్బంగా సింగరేణిలో రామగుండం నగరపాలక సంస్థ జాతర జరిగే చోట పారిశుద్యం పాటించడం, గ్రౌండ్ శుభ్రపర్చాలని, వాటర్ ట్యాంకర్లతో భక్తులకు త్రాగునీరు అందించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు(100) నిర్మించాలని, పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో శాశ్వత మిషన్ భగీరథ పైప్ లైన్ ఎర్పాటు చేయాలని, శుభ్రపర్చడానికి ఇద్దరు వ్యక్తులను నియమించాలని, ప్రతిరోజు చెత్తను శుభ్రపర్చుట, జాతర రోడ్డు నుండి గోదావరి నీరు ఉన్న ప్రాంతం వరకు తాత్కలిక రోడ్డు నిర్మించాలని, స్నానాలు ఆచరించడానికి షవర్స్ ఏర్పాటు చేయాలని, స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మించాలని, విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుండి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లుగా చూడాలని ,విద్యుత్ అంతరాయం కల్గకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని , గోదావరి నదిలొ నీరు ఎక్కువగా ఉన్నందున సేప్టి ఫెన్సీంగ్ ఎర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాతర జరుగు నాలుగు రోజులు 2 డాక్టర్లు , 2బెడ్స్, స్టాప్ నర్సులు, వైద్య సిబ్బంది,108 వాహనము, మందులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ అన్నారు. ఫైర్ ఇంజిన్ 24 గంటలపాటు షిప్టు డ్యూటిలలో అందుబాటులో ఉంచాలని తెలిపారు.జాతర జరుగు ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బంది కల్గకుండా చూడాలని, అవసరమైన చొట 25 సిసికేమారాలను ఎర్పాటు చేయాలని కలెక్టర్ పోలిసు శాఖ వారిని ఆదేశించారు. గోదావరిలో నీరు అధికంగా ఉన్నందున పుణ్యస్నానాలు చేసేవద్ద గజఈతగాలను అందుబాటులో వుంచాలని, నీటిపారుదుల శాఖ పుష్కర ఘాట్స్ మునిగిపోయినందున కొత్తగా స్నాన ఘట్టాలు ఎర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జాతర జరుగు సమయమున విద్యుత్ అంతరాయం కల్గకుండా చూడాలని, అదనపు ట్రాన్సఫర్మర్లను,జనరేటర్లను అందుబాటులో వుంచాలని, విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు . జాతర జరుగు సమయములో చలువ పందిర్లు, టెంట్లు, హుండీల ఏర్పాటు, కరపత్రాలు ద్వారా ప్రచారం చేయుట, పూజ కార్యక్రమాలు నిర్వహించుట, సిసి కెమారాల ఎక్కువ మొత్తంలో ఏర్పాటు, కేశ ఖండన శాల ఏర్పాటు, ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజన ఏర్పాటు, జాతర ప్రారంభానికి వి.ఐ.పి.ల ఆహ్వనోత్సవం, (2)పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఏర్పాటు చేయాలని మరియు నిర్వహణ వంటి పనులు దేవాదాయశాఖ వారు నిర్వహించాలని, గోదావరిఖని ఆర్టిసి డిపో మేనేజరు జాతర జరుగు ప్రాంతాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడపాలని, జాతర పరిసరాల ప్రాంతాలలోని అనుమతి లేని మద్యం దుకాణాలు మూసివేయాలని , భద్రత కోరకు కంట్రోల్ రూం పోలిసు శాఖ వారు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. జాతర నిర్వహణ అంశంలో ప్రతి ఒక్క శాఖ తమకు కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటీ చందర్ ,అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి రవీందర్, రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్ కుమార్,సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

       

Share This Post