సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2022 ను ఘనంగా నిర్వహిద్దాo: రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్

వార్త ప్రచురణ :
ములుగు జిల్లా :
శనివారం 30 అక్టోబర్ :
సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2022 ను ఘనంగా నిర్వహిద్దామని, వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా పొందే విధంగా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ గారు కోరారు. గత జాతరలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత మెరుగ్గా పని చేయాలన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2021 ఏర్పాట్లపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు,ములుగు శాసన సభ్యు రాలు దనసరి అనసూర్య ,జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గార్లు నేడు మేడారం జాతర పై సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి గారి మాట్లాడుతూ గత జాతర పూర్తి అయ్యాక మన దగ్గర కరోనా లాక్ డౌన్ పెట్టుకున్నాం,ఈసారి జాతరకు ముందు సంపూర్ణంగా ఈ కరోనా మహమ్మారి నశించాలని అమ్మవార్లను కోరుకున్నాను అని వారు అన్నారు. సరిగ్గా జాతరకు నేటికీ 100 రోజులు ఉందని,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలోనే ఈ జాతరకు ఎక్కువ నిధులు ఇచ్చి ఘనంగా జరుపుతున్నామన్నారు.జాతరకు సంబంధించి ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికే గుర్తించారు. చుట్టు పక్కల జరిగే పిల్ల జాతరలకు కూడా నిధులు కేటాయించుకుంటాం అని వారు అన్నారు.మౌలిక వసతులను పకడ్బందీగా ఏర్పాటు చేయాలనీ వారు అన్నారు.గత జాతరలో ఇచ్చిన 75 కోట్ల రూపాయలలో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టాం. అందులో చేపట్టిన ఓ హెచ్ ఆర్ సి లు పూర్తి చేసుకున్నాం అన్నారు. .ఈసారి కూడా కలిసి కట్టుగా పనిచేసి, ఇక్కడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవార్ల ఆశీస్సులు అందేలా కృషి చేద్దాం అని వారు అన్నారు. ఇప్పటికే 120 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చారు అని అన్నారు.మూడు చెక్ డ్యామ్ లు తీసెయ్యాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం అన్నారు. అదనపు ఓ హెచ్ ఆర్ సి లు కట్టుకోబోతున్నాం అన్నారు. అదనపు బ్లాక్స్, నూతన డైనింగ్ హాల్స్ నిర్మించుకుంటాం.జంపన్న వాగు దగ్గర రెండు దుస్తులు మార్పిడి చేసుకునే గదులు ఏర్పాటు చేస్తాం.పోలీసులకు కూడా శాశ్వతంగా వసతులు కల్పిస్తాం.గుంజేడు ముసలమ్మ జాతర కోసం వసతులు కల్పించాలని విజ్ఞప్తి వచ్చాయి తప్పకుండా వసతులు కల్పిస్తాం అని వారు అన్నారు. పగిడిద్ద రాజు దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తాం. పిల్ల జాతరకు కావాల్సిన నిధులు కూడా ఇస్తాం అని వారు అన్నారు.గత బడ్జెట్ నిధుల తో చేపట్టిన పనుల వివరాలు, ఇప్పుడు చేయవలసిన పనుల వివరాలు పారదర్శకంగా అందరికీ చెప్పే బాధ్యత మనకుంది. కాబట్టి అవన్నీ వివరాలు అందిస్తాం.గత పాఠాల నుంచి ఈసారి జాతర మరింత సమర్థవంతంగా నిర్వహించే విధంగా కలిసి పని చేద్దాం.ప్లాస్టిక్ రహిత జాతరకు అవగాహన కల్పించాలి. ఆ విధమైన ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలి.నామినేషన్ పనులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ద్వారా ఎక్కువ మంది స్థానిక గిరిజనులు/ఆదివాసీలకు ఇవ్వాలి. గిరిజన విశ్వ విద్యాలయం సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది.గట్టమ్మ దగ్గర డిగ్రీ కాలేజీకి 55 కోట్ల రూపాయలు ఇచ్చాం. త్వరలో టెండర్ పనులు మొదలవుతాయి.మనగపేట దగ్గర ఫ్లడ్ బ్యాంక్ పనులకు కూడా నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పనులు మొదలు కానున్నాయి.ఈ జాతర విజయవంతంగా జరిపేందుకు అందరూ సహకరించాలి.
ఈ సందర్భాగా ఎమ్మెల్యే దనసరి అనసూర్య ( సీతక్క) మాట్లాడుతూ గత జాతరలో వచ్చిన సమస్యలు మళ్ళీ పునరావృత్తం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.గిడిద్ద రాజు దగ్గర కూడా ఏర్పాట్లు చేయాలి.రహదారులు బాగుంటే ట్రాఫిక్ సమస్య తీరుతుంది.తిరుగు జాతర ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టి వసతులు కల్పించాలి.మేడారం జాతర విజయవంతం చేయడంపై మనమంతా దృష్టి పెట్టి పని చేయాలని కోరుతున్నాను. సమావేశం అనంతరం 1.13 కోట్ల రూపాయల తో కమ్యూనిటీ డైనింగ్ హాల్ షెడ్, బట్టలు మార్చుకునే గదులు, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకస్థాపన చేశారు.
జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ 3 చెక్ డ్యామ్ లుతొలగించాలని,ఆర్ అండ్ బి రోడ్స్ పస్ర నుండి మేడారం వరకు అదిక వర్షాల కారణంగా రోడ్లు డ్యామేజ్ అయినవని,వాటిని పరిశీలించి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ప్రకారం ఎస్టిమేట్స్ పంపించామని,గత జాతరలో ట్రైబల్ వెల్ఫేర్ నిధులతో 5 షేడ్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నాం అన్నారు.వాటిని పంచాయితి రాజ్ శాఖ అధికారికి పర్యవేక్షణలో ఉంటుందని అన్నారు. మేడారం టెంపుల్ కాకుండా చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న చిన్న టెంపుల్స్ కి భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు చేయవలసినదిగా పూజారులు కోరిన విధంగా తమరి మొదటి ప్రాదాన్యతగా మంత్రి గారు చొరవ తీసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ కోరారు. మేడారం లో చేపట్ట వలసిన పనులను లోకల్ ఎంపిటిసిలు, సర్పంచ్ లు కోరిన విదంగా కొన్ని పనులు నిబందనల మేరకు వేలేజ్ డెవలప్మెంట్ కమిటిలకు ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్ అన్నారు.
సమీక్షా సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీమతి నాగ జ్యోతి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఆర్డీఓ రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, డి.టి. డి. ఓ ఎర్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, ఐటిడిఏ ఏపిఓ వసంత్రావు , జెడ్పీటీసీలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఈ. ఓ రాజేందర్, ప్రధాన పూజారి జగ్గారావు, పూజారులు, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Share This Post