సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి టీజీఓ అధ్యక్షులు జగన్ మోహన్ రావు

సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి టీజీఓ అధ్యక్షులు జగన్ మోహన్ రావు

ప్రెస్ నోట్

తేది:07-05-2022

సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి టీజీఓ అధ్యక్షులు జగన్ మోహన్ రావు

స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండ  నగరంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వేసవి క్రీడ శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా చిన్నారులు మైదానాలకు దూరమయ్యారన్నారు. శారీరకంగా దృఢంగా ఉంటేనే అనారోగ్యాలు దరిచేరవు అన్నారు. బాల్యం నుండే చిన్నారులను క్రీడల పట్ల ఆకర్షితులు చేసేందుకు ఈ సమ్మర్ క్యాంప్ దోహదపడనున్నట్లు చెప్పారు. క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడాంశంలో శిక్షణ పొంది మెరుగైన నైపుణ్యాలను సాధించేందుకు  ఈ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లో హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి గుగులోతు అశోక్ కుమార్, కోచ్ లు నరేందర్ శ్రీమన్నారాయణ, విష్ణువర్ధన్, కె. రమేష్, మహ్మద్ అఫ్జల్, ప్రశాంత్, జగదీష్,  నవీన్, కె.రాజులు పాల్గొన్నారు.

Share This Post