సరికొత్త సొబగులతో .. కొత్త చెరువు ముస్తాబు: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*సరి కొత్త సొబగులతో….*
*కొత్త చెరువు ముస్తాబు*

– మంత్రి ప్రత్యేక చొరవ తో పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న కొత్త చెరువు

– త్వరలో రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న “సరి” కొత్త చెరువు

– పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి

——————————
సిరిసిల్ల 07, మే 2022 :
——————————-
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుకు సరి కొత్త పర్యాటక క‌ళ వ‌చ్చింది.

రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు ఆలోచనలకు అనుగుణంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్ గా, పురప్రజలకు ఆహ్లాదం ను పంచే గమ్య స్థానం గా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ ల మార్గదర్శనం లో పురపాలక అధికారులు తీర్చిదిద్దుతున్నారు.

రూ. 11 కోట్లతో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొత్త చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా కొత్త చెరువు ను ముస్తాబు చేశారు. బండ్ రహదారి వైపున ఆకట్టుకునేలా జంతువులు, పక్షులతో కూడిన ఆకారాలు రూపొందించి ఆకర్షించేలా రంగులు వేశారు.
1.8 కిలో మీటర్ ల మేర ట్యాంక్ బండ్ ను
ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే విధంగా వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ గ్రీనరి, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. పిల్లలకు కోసం ప్రత్యేక రైలు ట్రాక్, వేకువ జామున ఆరోగ్య క్రియలు చేసేందుకు యోగ శాల, క్యాంటీన్, చిన్నచిన్న బర్త్ డే పార్టీ లాంటి శుభకార్యాలు చేసుకునేలా వేదిక , వసతులతో పాటు జలాశయంలో విహారించేందుకు బోటింగ్ సౌకర్యం కల్పించారు.

*3.5 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి*

సువిశాల 3.5 ఎకరాల్లో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించే , వినోదం పంచే అనేక ఏర్పాట్లు చేశారు.
పాత్ వే లు, బేబీ కేర్ సెంటర్, కియోస్క్ లు, సీతాకోక చిలుక ల గార్డెన్, చిట్టడివి గార్డెన్, పూల గార్డెన్, ఫౌంటైన్, వ్యూ పాయింట్ డెక్, ల్యాండ్ స్కేపింగ్ , డాబాలు వంటి సౌకర్యాలు కల్పించారు.

అలాగే రూ.కోటి రూపాయలతో జిప్ సైకిల్, జీప్ లైన్, క్రొకోడైల్ స్లయిడ్, చిల్డ్రన్ మల్టీ ప్లే ఎక్విప్మెంట్, కమాండో కోర్స్, నెట్, మ్యూజికల్ ప్లే ఇన్స్ట్రుమెంట్ లు, ఏరో ప్లేన్ స్లయిడ్, స్ప్రింగ్స్, జాయింట్ స్వింగ్, డైనోసార్ వంటి పిల్లలను ఆకర్షించేలా ఆటల పరికరాలను ఏర్పాటు చేశారు.

*రాత్రి వేళల్లో… జిగేల్ వెలుగులు*

రాత్రి వేళల్లో ట్యాంక్ బండ్ దేదీప్యమానంగా వెలుగొందేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు.

మంత్రి ప్రత్యేక చొరవ తో పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న కొత్త చెరువు పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు….పూర్తి చేయడం పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులు వేగిరం అయ్యేలా చూస్తున్నారు.

త్వరలోనే రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు చేతుల మీదుగా పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసిన కొత్త చెరువు ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

——————————

Share This Post