సరి కొత్తగా సర్కార్ పాఠశాలలు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 13 పాఠశాలలు 1. 19 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాల భవనాలు, కార్పొరేటర్ ను తలపించేలా మొదటి విడత పాఠశాలలు గ్రామాలకే తలమానికంగా ఉన్న సకల వసతుల నాణ్యమైన చదువులు కోసం నేడు ముస్తాబైన మన ఊరు మనబడి పాఠశాలలు.

నాడు అరకొర వసతులతో సర్కారు బడులు, నేడు సకల వసతులు సరికొత్త రూపురేఖలతో కార్పొరేట్ ధీటుగా
మన ఊరు మన బడి తో సరికొత్త హంగులను అధ్ధుకున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 125 ప్రభుత్వ పాఠశాలలు మొదటి దశలో ఎంపిక కాగా నేటి వరకు 13 పాఠశాలలు సర్వంగ సుందరంగా ముస్తాబైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.

జిల్లాలో విద్యాభివృద్ధి ద్యేయంగా విద్యార్థులకు పాఠశాల భవనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో అదనపు తరగతి గదులు అధునాతన మరుగుదొడ్లు మూత్రశాలలు తాగునీటి వసతి కిచెన్ షెడ్లు వాకింగ్ ట్రాకులు గ్రీనరీ డ్యూయల్ డెస్క్లు బ్లాక్ బోర్డులు డిజిటల్ క్లాస్ రూమ్స్ లైబ్రరీ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ సమకూర్చుకున్నాయి. నూతన భవన నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా శిథిల వ్యవస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణాలు పునర్నిర్మానాలు చేసి సుమారు జిల్లాకు 125 పాఠశాల గాను 26.5కోట్లు రూపాయలతో మంజూరు కాగా అందులో 13 పాఠశాలలో పూర్తయి అందుబాటులోకి వచ్చియని కలెక్టర్ తెలిపారు.

ఏటూర్ నాగారం మండలంలో ఆకుల వారి ఘనపురం ప్రాథమిక పాఠశాల, ఏటూర్ నాగారం ప్రాథమిక పాఠశాల, గోవిందరావుపేట్ మండలకేంద్రంలో ప్రాథమిక పాఠశాల ,కన్నాయిగూడెం మండలంలో ప్రాథమిక పాఠశాల గుర్రేవుల, మంగపేట మండలం ప్రాథమిక కోన్నంత పాఠశాల బాలన్న గూడెం, ములుగు మండలం ప్రాథమిక పాఠశాల మల్లం పల్లి, తాడ్వాయి మండలం ప్రాథమిక పాఠశాల ఇంద్ర నగర్, వెంకటాపూర్ మండలం ప్రాథమిక పాఠశాల బూరుగు పేట, వెంకటాపూర్ మండలం ప్రాథమిక పాఠశాల ఇంచెన్చెరువు పల్లి, వెంకటాపురం మండలం ప్రాథమిక పాఠశాల నాయకుల గూడెం, వెంకటాపురం మండలంలో ప్రాథమిక పాఠశాల ఆర్ఆర్ పురం కాలనీ, వాజేడు మండలం ప్రాథమిక పాఠశాల బొల్లారం ప్రాథమిక పాఠశాల రామాపురం పాఠశాల భవనాలు నేటి వరకు అన్ని సౌకర్యాలతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సర్వంగా సుందరంగా ముస్తాబయి విద్య అభివృద్ధి కోసం అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ వివరించారు.

Share This Post