సరైన పద్దతిలో ఉపయోగించుకుంటే చెత్త కూడా సేంద్రియ ఎరువుగా ఉపయోగ పడుతుందని నిరూపించిన రామన్న గూడెం గ్రామ పంచాయితీ సిబ్బంది.

పారిశుద్ధ్య నిర్వహణ అనేది సామాజిక బాధ్యత.
అను నిత్యం మన ఇంట్లో పోగు అయ్యే చెత్తను ఇష్టం వచ్చినట్టు బయట పడేయకుండా తడి చెత్త, పొడి చెత్త అని రెండు రకాలుగా విభజించాలని ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ప్రతి ఇంటిలో శానిటేషన్ సరిగా ఉంటేనే ఆకాలనీ, ఆగ్రామం రిశుభ్రంగా ఉంటాయని.తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి ద్వారా వివిధ రకాల సమావేశాలు, అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించింది.

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన డంప్ యార్డ్ నిర్మాణాలు జరగాలని ఆదేశించారు.

అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.హరిత జిల్లాలోని నాలుగు వందల 401 గ్రామాలలో డంప్ యార్డ్ నిర్మాణాలు త్వరతిగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ప్రతీ రోజూ ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా జరిగి దానిని డంపు యార్డ్ కు తరలించాలని గ్రామ స్థాయి, మండల, స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

కలెక్టర్ ఆదేశాలనుసారం గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతీ రోజూ ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా పనికిరాని చెత్త నుండి ఎంతో ఉపయోగకరమైన ఎరువును కుడా రూరల్ జిల్లా గ్రామ పంచాయతీ సిబ్బంది తయారు చేస్తున్నారు.

సిహెచ్ లక్ష్మి :సెక్రటరీ, రాగన్న గూడెం గ్రామం ,రాయపర్తి మండలం.

మొదలు డంపు యార్డ్ కు వచ్చిన తడి చెత్తనుచిన్న చిన్న గా ఉండే సేంద్రియ ఎరువుల గదిలో వేసుకుంటాం ఇంకో గదిలో ఆరు ఇంచుల మందం ఇసుక వేసి దానిమీద ఒక షీట్ లాగా ఎండు గడ్డి వేస్తాం.. దానిమీద రెండు ఇంచుల మందం తడి చెత్త ను వేసి ఆ తరువాత ఐదు కేజీల వానపాములను పోస్తాం..ఒక బకెట్ నీళ్ళలో ఎండిన పేడని కలిపి మందంగా ఒక పొర గా పోస్తాము.

ఆ తరువాత ఆ మిశ్రమం మీద గోనె సంచులు ఉంచుతాం.రోజుకు ఐదు లీటర్ల నుండి ఎనిమిది లీటర్ల నీళ్లను ఇరవై ఒక్క రోజుల వరకు స్ప్రే చేస్తాం.20 రోజుల తర్వాత అదీ వర్మి కంపోస్టు గా తయారవుతుంది.

గోవర్ధన్ రెడ్డి :సర్పంచ్, రాగన్న గూడెం.

గతంలో నాకు వర్మీ కంపోస్టు షెడ్డు ఉండేది.దానివల్ల వర్మి కంపోస్టు తయారీ ఆవశ్యకత నాకు తెలుసు.డంపు యార్డ్ లకు వచ్చే చెత్తను ఎందుకు అలాగే పడేయాలి అని ఇలా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాము.

ఈ ఎరువును అవెన్యూ, నర్సరీ లోని ప్లాంట్స్ లకు, పల్లె ప్రకృతి వనం లోని మొక్కలకు వాడుతున్నాం..

జిల్లా కలెక్టర్ హరిత గారు కూడా మా దగ్గర 200 రూపాయల ఎరువును కొన్నారు..ఆ నగదు ను పంచాయతీ అకౌంట్లో జమ చేసాము .

చెత్త ..చెత్త కాదు దానిని సరైన పద్దతి లో రీ సైకిల్ చేస్తే మళ్ళీ దానిని ఉపయోగించు కోవచ్చు. అంతే కాదు దీని వల్ల చెత్త వేయటానికి ఉన్న స్థలం ఎక్కువ కాలం ఉపయోగం లో కుడా ఉంటుంది…

ప్రతీ రోజూ ఇంటి ఇంటికి వచ్చి చెత్తను సేకరించడమే కాక అందులో నుండి సేంద్రియ ఎరువును తయారీ చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రజలు మెచ్చుకుంటున్నారు.

Share This Post