సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విధ్య నే కావాలనే రోజులు తెలంగాణ లో వచ్చాయి వెయ్యి గురుకుల పాఠశాల ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 117 కోట్లు కేటాయింపు:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

విధ్యారంగం పై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమే మన ఊరు -మన బడి

ప్రభుత్వ స్కూళ్ళలో విధ్యా ప్రమాణాలకు ప్రభుత్వం పెద్దపీట

దేశం లో ప్రభుత్వ విధ్య, వైధ్యానికి ప్రజల ఆదరణ లభిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే

సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విధ్య నే కావాలనే రోజులు తెలంగాణ లో వచ్చాయి

వెయ్యి గురుకుల పాఠశాల ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 117 కోట్లు కేటాయింపు

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
చివ్వెంల మండల కేంద్రం లో మన ఊరు – మన బడి లో బాగంగా 18లక్షల వ్యయం తో నిర్మించిన అదనపు గదులు, అదునిక వసతులను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

నూతన పశువుల దవాఖాన భవనం ప్రారంభంచిన మంత్రి

నూతన గ్రామ పంచాయితీ భవనం, సీసి రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
సూర్యాపేట/చివ్వెంల

విధ్యారంగం పై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమే మన ఊరు -మన బడి పథకం అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండల కేంద్రం లో మన ఊరు మన బడి పథకం లో బాగంగా నూతనంగా ఆధునీకరించిన మండల పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంబించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒక్క తరం చదివితే ఇక ఆ సమాజానికి తిరుగులేదని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాల లో విద్యా ప్రమాణాలను పెంచేదుకే మన ఊరు, మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
పిల్లలుచదువుకోవడానికి,ఉపాధ్యాయులు బోధించడానికి సకల వసతులు ఉండాలని, పాఠశాల అవరణ లో అహ్లాదకరంగా ఉంటేనే చదువులు సరైన పద్దతిలో కొనసాగుతాయనే ఉద్దేశ్యం తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ 7,289 కోట్ల రూపాయల తో రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు – మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 117 కోట్లు కేటాయించారని తెలిపారు. దేశంలో ప్రభుత్వ విధ్య, వైద్యానికి ప్రజల నుండి ఆదరణ లభిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాం లో సర్కారు బడి వద్దన్న రోజులు పోయి, మాకు సర్కారు విధ్య నే కావాలనే రోజులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల లో అడ్మిషన్ ల కోసం పెరుగుతున్న పోటీ నే దీనిని నిదర్శనం అని మంత్రి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం వెయ్యి గురుకులాలు ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని అన్నారు. తెలంగాణ పుట్టి ఎనిమిదిన్న‌రేండ్లు అవుతుందన్న మంత్రి 75 ఏండ్ల స్వ‌తంత్య్ర భార‌త‌దేశంలో ఏ రాష్ట్రంలో జ‌ర‌గ‌ని అభివృద్ధి, సంక్షేమాన్ని తెలంగాణ‌లో తీసుకుపోతున్నాం అన్నారు. ఈ ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. వ్య‌వ‌సాయం, సాగునీరు, విద్యుత్, విద్య‌, వైద్యం, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య రంగాల్లో వేలు పెట్టి చూపే ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌జ‌ల స‌ర్వ‌తోముఖాభివృద్ధి ల‌క్ష్యంగా, అభివృద్ధే మా కులం, సంక్షేమ‌మే మా మ‌తం, జ‌న‌హిత‌మే మా అభిమ‌తం అనే దిశ‌గా ముందుకు పోతున్నాం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
అధ్యాపకుడి గా మారి…చిన్నారుల తో మమేకమై..
మన ఊరు మన బడి లో బాగంగా నూతన తరగతి గదులను ప్రారంభించిన మంత్రి , అనంతరం అధ్యపకుడిగా మారారు.. చిన్నారుల బెంచీ పై కూర్చుని వారితో మమేక మయ్యారు. టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ ను పరిశీలించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు పిల్లలు టకీ మని సమాధానాలు చెప్పారు.. అపురూపంగా పిల్లలలను దగ్గరకు తీసుకున్న మంత్రి విధ్య ను కష్టం గా భావించకుండా ఇష్టంగా చదవాలని సూచించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపన
చివ్వెంల మండల కేంద్రం లో మన ఊరు మన బడి తో పాటు 80 లక్షల వ్యయం తో చేపట్టిన నూతన పశువుల దవాఖన ను మంత్రి ప్రారంభించడం తో పాటు నూతన గ్రామ పంచాయితీ భవనానికి,సి.సి రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అభివృద్ది పండుగ జరుగుతున్న క్రమం లో గ్రామానికి వచ్చిన మంత్రి కి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కార్యక్రమం లో జడ్పీ వైస్ ఛైర్మెన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపిపి కుమారి బాబునాయక్, జడ్పీటిసి సంజీవ నాయక్, వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుదీర్ రావ్, బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ,రౌతు నర్సింహ రావు, రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారయణ రెడ్డి,మాజీ మార్కెట్ డైరెక్టర్ ఊట్కూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post