పత్రిక ప్రకటన
తేది.31.10.2022.
సోమవారం
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ సమైక్యత దినోత్సవం ను నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, సిబ్బంది చే జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాంచారని,ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకోవడము జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జేసీ సంధ్యా రాణి, dro వాసు చంద్ర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.