సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి
——————————

సమసమాజం కోసం, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు

తెలంగాణ వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు పాపన్న గౌడ్ కు తగిన గౌరవం కల్పించటం బాధ్యతగా భావించిన సీఎం కేసీఆర్.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

గురువారం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 372 వ జయంతి వేడుకలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

జయంతి వేడుకల్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా బిసి అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, గౌడ సంఘం నాయకులు తదితరులు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ….
సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని అన్నారు. వారి స్ఫూర్తి తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ బడుగు, బలహీనవర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు.బీసీల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…..
ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, సమ సమాజ స్థాపనకు పాపన్న గౌడ్ పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూర్తి నిస్తుందన్నారు. మూడు శతాబ్దాల గడిచినా వారి చరిత్ర మనల్ని ఉత్తేజం చేస్తూనే ఉందన్నారు.

——————————

 

Share This Post