సర్పంచ్‌ల భాగస్వామ్యంతోనే సమగ్ర గ్రామాభివృద్ధి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

సర్పంచ్‌ల భాగస్వామ్యంతోనే సమగ్ర గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆగస్టు-2021 మాసంలో గ్రామాల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన సర్పంచ్‌లను జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెద్దితో కలిసి సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌ల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని, మొదటిసారి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో పల్లెప్రగతి పనుల్లో జిల్లా చివరి స్థానంలో ఉండడం పట్ల ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసహనం వ్యక్తం చేశారని, జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి జిల్లాలోని సర్పంచ్‌లు, పంచాయితీ కార్యదర్భులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పల్లెప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని, ఇందులో సర్పంచ్‌ల నుండి పూర్తిస్థాయి సహకారం అందిందని అన్నారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రక్రియ పకడద్చందీగా జరుగుడం వల్ల డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నా 13 జిల్లాలో ఆసిఫాబాద్‌ లేకపోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి పథంలో ఉండే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని తెలిపారు. అక్టోబర్‌ 2న జిల్లాలో మొత్తం 18 [గ్రామపంచాయతీలకు ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డులు ప్రధానం చేయడం జరుగుతుందని, ఇందులో మండలానికి ఒకటి చొప్పున, అలాగే డివిజన్‌కు ఒకటి చొప్పున, జిల్లా మొత్తానికి ఒకటి చొప్పున మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచిన పంచాయతీకి బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు, డివిజన్‌ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీకి రజత పతకంతో పాటు 75 వేల రూపాయల నగదు, మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీకి కాంస్య పతకంతో పాటు 50 వేల రూపాయల నగదు అందజేయడం జరుగుతుందని, ఇప్పుడు ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన అందరు కూడా ఆ అవార్జులో ఉండాలని తెలిపారు. జిల్లాలో రెండు పంటలు విధానాన్ని తీసుకురావాలని, ఇందు కోసం రైతులను ప్రోత్సహించే విధంగా జైనూర్‌ మండలం దుబ్బగూడ గ్రామం నుండి ప్రారంభించడం జరుగుతుందని, రబీ సీజన్‌లో 30 వేల ఎకరాల సాగు లక్ష ఎకరాలకు పెంచాలని తెలిపారు. జిల్లాలో రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించుకోవచ్చని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడి బయట, బడి మానివేసిన పిల్లలు లేకుండా సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ చూపాలని, ఆదర్శ సర్బంచ్‌లకు ప్రత్యేక టూర్‌లు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఆదర్శ గ్రామ పంచాయతీలో పరిపాలన విధానాన్ని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన సగ్రగేషన్‌ షెడ్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసి రీసైక్తింగ్‌ చేయడం ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుందని, జిల్లాలో పల్లె ప్రగతి పనులు చాలా బాగా జరిగాయని, ఇందులో సర్పంచ్‌ల పాత్ర కీలకమైనదని అభినందనించారు. జైనూర్‌ మండలం దుబ్బగూడ గ్రామంలో తడి-పొడి చెత్త నిర్వహణ ప్రక్రియ ఆదర్శవంతంగా ఉందని, పారిశుద్ధ్యం, హరితహారానికి సంబంధించి ప్రత్యేక కమిటీలు వేసి ఎప్పటికప్పుడు వాటితో సమావేశాలు నిర్వహించాలని, బహిరంగ మలవిసర్జన లేకుండా సర్పంచ్‌లు దృష్టి సారించాలని, ఇందు కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ చట్టంపై కొంత అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. సన్మాన కార్యక్రమం నిర్వహించడంతో భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పనిచేయడానికి నూతనోత్తేజం కలిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గుణవంతరావు,
జిల్లాలోని 25 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post