సర్వసభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలి వాజేడు, వెంకటాపురం మండలాలకు రెండు గ్రంథాలయాలకు నిధులు కేటాయించిన ఎమ్మెల్సీ జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటిని వెంటనే ఏర్పాటుచేయాలి
డిఆర్.డిఎపై పై వస్తున్న పత్రిక కథనాలపై వివరణ కోరినసభ్యులు
అధికారులకి, ప్రజా ప్రతినిదులకి మార్గ నిర్దేశనం చేసిన ఎమ్మెల్సీ ప్రభుత్వ పథకాలను అధికారులు
విధిగాఅమలు చేయాలి అధికారులు విది నిర్వహమలో ప్రజలు, ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందాలి
సమగ్ర చర్చ జరగాలి అంటే అధికారులు సమాచారాన్ని జిల్లా, మండల పిరషత్ లకు ముందుగా అంగదజేయాలి
వరదలలో పాడైన రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. మన ఊరు మన బడి తో ప్రభుత్వ విద్య వ్యవస్థ పటిష్టం సర్వ సభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ …………..
సర్వసబ్య సమావేశానికి అధికారుల విధిగా హాజరు కావాలని ములుగ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.
ఈ రోజు మలుగు జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా స్థానిక సంస్థల ఎమ్మల్సీ తాతమధు హాజరయ్యారు.
ఈ సమవేశంలో ముఖ్యంగావైద్య ఆరోగ్య , జిల్లా గ్రామీణా అభివృద్ది మరియు రోడ్డు అభివృద్ది భవనాలు విద్యా, మిషన్ భగీరథ , విద్యుత్, జిల్లా సహాకార , వ్యవసాయ, భూగర్బ గనుల శాఖ తదితర శాఖలపై చర్చించడం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికలో భాగంగా ఆరు విడతలలో ఎంత సర్వే జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచతేసిన టి డయాగ్నిస్టిక్ సెంటర్ లో భాగంగా ములుగులో కూడా ఒకటి ఏర్పాటుచేయడం జరిగిందని జిల్లాలోని 30 వేల మంది రోగులకు ఇప్పటి వరకు నిర్వహించడం జరిగిందని , నిక్షయ్ మిత్ర అనే టిబి రోగుల కోసం ఏర్పాటు చేసిన న్యూట్రిషియన్ , హోమ్ఐసోలేషన్ కిట్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. డిసిహచ్ఎస్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు విధిగా హాజరు కావాలని సూచించరు. జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటిని వెంటనే ఏర్పాటుచేయాలని సూచించారు.
రోడ్లు మరియు భవనాల ప్రగతి నివేదికలో భాగంగా వరద ప్రాంతాలలో దెబ్బ తిన్న రోడ్ల కోసం అభివృద్ది పనులకు నివేదికలు పంపాయమని సంపంధిత అధికారి తెలిపారు. ఈ రోజు జరిగే రాష్ట్ర అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రోడ్ల రూపు రేఖలు మారనన్నట్లు ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. విద్యాశాఖ ప్రగతి నివేదికలో బాగంగా జిల్లా పరిషత్ సమావేశానికి అజెండాను ముందుగా సమర్పించాలని, సర్వసభ్య సమావేశం జరిగేటప్పటికి విద్యాశాఖకు సంపంధించిన సమగ్ర సమచారాన్ని జిల్లా పరిషత్ కు సమర్పించకపోవంతో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, సభ్యులు జిల్లా పరిషత్ సమావేశాలకు ముందుగా సమాచారం అందజేయని అదికారులకు నోటీసులు అందించాలని జడ్పీ సిఇఓకు జిల్లాకలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. మిషన్ ఙగీరథ ప్రగత నివేదక తెలిపిన అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాలలో లీకేజీలు లేకుండా చూడాలని ప్రజలకు రోడ్లపై అసౌర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే వేసవి కాలంలో త్రాగునీటి సమస్య ఎదురుకాకుండా పక్కా ప్రణాలికతో చర్యలుచేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ సమీక్షలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న 24 గంటల కరెంట్ గ్రామాలలో నివాస గృహాల పై నుండి వేల్లే విద్యుత్ తీగలవల్ల ప్రజలకు జరగే అసౌకర్యాన్ని గుర్చింతి వాటిని సరిచేయాలని శాక అధికారులకు సభ్యులు సూచించారు. డిఆర్డిఎ పరిధిలో ధాన్యం కొనుగోలు కమీషన్ల చెల్లింపులో జాప్యంలేకుండా చూడాలని అధికారులను సూచించారు. డిఆర్ డిఎ శాఖపై వివిద ప్రత్రికలలో వస్తున్న కథనాల గురించి ప్రజా ప్రతినిధులు వివరణ అడుగగా కలెక్టర్ స్పందిస్తూ పిఓ ఐటిడిఏ తో విచారణ జరిపిస్తానని కలెక్టర్ తెలిపినారు.
ఎమ్మెల్సీ తాత మధు:-
ఈ సందర్బంగా ఎమ్మల్సీ తాత మధు మాట్లాడుతూ మూసా పద్దతులలో కాకుండా నూతన పద్దతలు అవలంభించి అభివృద్ది పథంలో నడువాలని, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిస్తేనే ప్రభుత్వం సజావుగా సాగుతుందని ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబు దారి తనంగా ఉంటూ ప్రభుత్వ అధికారులచే ప్రజలకు అనుసంధాన కర్తలుగావ్యవహరించాలన్నారు. ప్రజల కోసం సక్రమంగా పనిచేయాల్సిన భాధ్యత ప్రజల కోసం ఉందని వారిచే పనిచేయించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉందని ఆయన అన్నారు. అభివృద్దిలో భాగంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే గొరంతలు కొండంతలు చేయకుండా సమన్యయంతో అధికారులు , ప్రజా ప్రతినిధులు ముందుకు పోవాలని తెలంగాణ అభివృద్దిలో భాగంగా కావాలని, ప్రజా ప్రతినిధులు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకవస్తే అధికారులు అలసత్వం వహించకుండ వంటనే స్పందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ ప్రసూన రాణి, ములుగు, గోవిందరావుపేట, వెంకటాపూర్ , తాడ్వాయి , వాజేడు, వెంకటాపూర్ మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, కోఆప్షన్ సభ్యులు సకినాల భవాని, గండ్రకోట శ్రీదేవి, బుర్ర రజిత,గై రుద్రమదేవి, తుమ్మల హరిబాబు, బడే నాగజ్యోతి, పుష్పలత, శారద, ఎంపిపిలు బుర్ర రజిత సమ్మయ్య, గొంది వాణిశ్రీ ,సూడి శ్రీనివాస్ రెడ్డి, ఆయాశాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.