సర్వే నంబర్ల వారీగా రైతులు పండిస్తున్న పంటల ఉత్పత్తి అంచనా సిద్ధం చేయాలి….. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

సర్వే నంబర్ల వారీగా  రైతులు పండిస్తున్న పంటల ఉత్పత్తి అంచనా సిద్ధం చేయాలి….. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

ప్రచురణార్థం

సర్వే నంబర్ల వారీగా రైతులు పండిస్తున్న పంటల ఉత్పత్తి అంచనా సిద్ధం చేయాలి….. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

పెద్దపల్లి, సెప్టెంబర్ -30:

రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఉన్న సర్వే నంబర్ ల వారీగా భూమి హద్దులను, ఆ భూముల్లో పండిస్తున్న పంటల అంచనాలు ఖచ్చితత్వంతో తయారు చేయాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ సంభందిత అధికారులకు తెలిపారు.

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ పంట కోత ప్రయోగాల నిర్వహణ పద్ధతులపై ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న భూముల యొక్క హద్దులపై రెవెన్యూ మ్యాప్ ప్రకారం అవగాహన కలిగి ఉండి తమకు కేటాయించిన పరిధిలో రైతులు ఏ పంటలను పండిస్తున్నారు, ఎవరు పండించటం లేదో తెలిసి ఉండాలని, క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలన చేసి పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

మన జిల్లాలో పండిస్తున్న పంటల వివరాల నమోదు చాలా కీలకమైందని, ఆహార ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, ఎగుమతి, దిగుమతుల ప్రణాళిక రూపకల్పన వంటి వాటికి ఉపయోగపడతాయని అన్నారు.

గ్రామాలలో రెవిన్యూ మ్యాప్ ఆధారంగా సర్వే నెంబర్ల వారీగా పంటలను పరిశీలించి , శాంపిల్ పంట ప్రాంతం గుర్తించి పంట కోత నిర్వహించాలని, వాటికి అనుగుణంగా గ్రామాల వారీగా పంట దిగుబడి అంచనా సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

గతంలో జిల్లాలో నమోదు చేసిన పంట దిగుబడి అంచనాలు తారుమారయ్యాయని, ప్రస్తుతం అలా అవడానికి వీలు లేదని, క్షేత్రస్థాయి సమాచారంతో 99% అక్యురెట్ గా అంచనా ఉండాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

పెద్దపల్లి జిల్లాలో 2016 సంవత్సరంలో వానాకాలంలో 2.04 లక్షల ఎకరాల సాగు నుంచి ప్రస్తుతం 2.86 ఎకరాలు సాగు విస్తీర్ణం పెరిగిందని, భవిష్యత్తులో మరో 30 వేలు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. వానాకాలం పంటలో అధికంగా 2.13 లక్షల ఎకరాలలో దాన్యం, 63 వేల ఎకరాలలో పత్తి సాగు
అవుతున్నదని, 146000 వేల ఎకరాలకు ఎస్సారెస్పీ కాలువలు చెరువుల ద్వారా సాగునీరు అందుతుందని, 88వేల ఎకరాలకు ఓపెన్ వెల్స్ ద్వారా, 24 వేల ఎకరాలకు బోర్వెల్స్ ద్వారా సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు.

———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post