సర్వ మతాలను ఆదరించి సోదరభావంతో మెలిగే దేశం మన భారత దేశమని, ప్రతి ఒక్కరూ పరమత. సహనంతో మెలగాలని, అన్ని మతాలకు స్వేచ్ఛ, సమానత్వం, కల్పించబడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 22, ఖమ్మం –

సర్వ మతాలను ఆదరించి సోదరభావంతో మెలిగే దేశం మన భారత దేశమని, ప్రతి ఒక్కరూ పరమత. సహనంతో మెలగాలని, అన్ని మతాలకు స్వేచ్ఛ, సమానత్వం, కల్పించబడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద క్రైస్తవులకు ప్రతి సంవత్సరం అందిస్తున్న దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని సహకారనగర్ టబర్నకల్ బాప్టిస్ట్ చర్చిలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి దుస్తులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ సర్వమతాలను సమానంగా ఆదరించే దేశం, రాష్ట్రం మనదని, పరమత సహనానికి చక్కటి ఉదాహరణ అని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ అన్ని మతాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ దుస్తుల పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్టమస్ పండుగ ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఘనంగా జరుగుతుందని, మనుషులలో మానవత్వం నింపి, పాప విముక్తులను చేయడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని మంత్రి అన్నారు. క్రీస్తు పుట్టిన రోజున జరుపుకునే క్రిస్టమస్ సందర్భంగా ప్రభు దీవెనలు అందరిపై ఉండాలని క్రైస్తవ సోదరీ, సోదరమణులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టమస్ సందర్భంగా పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేస్తున్నదని, అన్ని మతాల ప్రజలు సుఖసంతోషాలతో, తమ పర్వదినాలను జరుపుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ కలెక్టర్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.

నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక కార్పొరేటర్ శ్రీ దివ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి శ్రీమతి జ్యోతి, అర్బన్, తహశీల్దారు శైలజ, సి.యస్.ఐ చర్చ్ అధ్యక్షులు జాన్ కాంతారావు, ఫాస్టర్స్ శేషుబాబు, లాజర్స్, బి.సురేష్, పాల్ సంజీవరావు, రమేష్పాల్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post