సర్వ లోకాన్ని కాపాడుతున్న దేవుడు రైతు మాత్రమేనని, రైతు కష్టపడి పండించిన ధాన్యం తిని అందరూ బ్రతుకుతారు కాబట్టి రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సర్వ లోకాన్ని కాపాడుతున్న దేవుడు రైతు మాత్రమేనని, రైతు కష్టపడి పండించిన ధాన్యం తిని అందరూ బ్రతుకుతారు కాబట్టి రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం షాపింగ్ కాంప్లెక్స్, పి.ఏ.సి.ఎస్ అగ్రి మార్ట్ ప్రారంభోత్సవంతో పాటుగా పి.ఏ.సి.ఎస్ కార్యాలయ భవనం, 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము, 500 మెట్రిక్ టన్నుల ఆవంచ వ్యవసాయ గొదాములకు శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేవి కావని, అధిక వడ్డీలతో సౌకారుల నుండి రుణాలు తీసుకునే వారన్నారు. రైతులే తమ కొంత వాటా జమచేసి అంజమాన్ సోసాయిటి ఏర్పాటు చేసి వాటి నుండి రుణాలు తీసుకునేవారని వాటి రూపాంతరమే నేటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని గుర్తు చేశారు. గోరిట సోసాయిటి ద్వారా తిమాజిపేటలో ప్రాథమిక సహకార సంఘాన్ని బలోపేతం చేయడం అభినందనీయమన్నారు. సహాకార సంఘం బలోపేతం అయితే పరోక్షంగా రైతులకు, ప్రత్యక్షంగా సహకార సంఘానికి లాభం చేకూరుతుందని తెలియజేసారు. మండల రైతుల అభీష్టం మేరకు ఒక సంవత్సరం లోపల కార్వేన, వట్టేమ్ రిజర్వార్ పనులను వందశాతం పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా బిజినేపల్లి మండలంలో దాదాపు 30 వేల ఎకరాలకు సాగు నీరు అందేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవసాయ గోదాం మంజూరు చేయించడం జరుగుతుందని అందుకు ఆనుగుణంగా స్థలాన్ని చూసి కేటాయించవలసిందిగ జిల్లా కలెక్టర్ ను సూచించారు. పిపిపి మోడల్ లో ఒక పెట్రోల్ పంపు మంజూరుకు చర్యలు తీసుకుంటానని తెలియజేసారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ముందుకు రావాలని, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ గింజలు వంటివి వేయాలన్నారు. అయితే వరి సాగు చేసేవారు ఈ సారి పత్తి సాగు అధికంగా చేయాలని, కేంద్ర ప్రభుత్వం పత్తికి మంచి మద్దతు ధర ఇస్తుందని మార్కెట్ లో సైతం మంచి డిమాండు ఉందని సూచించారు. యసంగిలో వరి పండించవద్దని రైతులను కోరారు. రాబోయేరోజుల్లో వ్యవసాయ పరిశ్రమలు వస్తాయని వాటిలో రైతులు పండించిన పంటలను శుద్ధి చేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న చోట సరఫరా చేయడం జరుగుతుందన్నారు. తద్వారా వ్యవసాయ రంగం నుండి అనేక మందికి ఉపాధి దొరుకుతుందని తెలియజేసారు. అనంతరం తెలకపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ గోదాము కు మంత్రి శంఖుస్థాపన చేశారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇంత పెద్దమొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం అన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ మల్కనూర్ పి.ఏ.సి.ఎస్ కన్నా గొప్ప పెరు తెచుకునేవిధంగా చూడాలని డైరెక్టర్ జక్క రఘునందన్ ను సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిగతా పి.ఏ.సి.ఎస్ లు చూసి అవి కూడా తిమ్మాజీపేట సహకార సంఘమును ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు.
కార్యక్రంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రైతులు ఇంత సంతోషంగా ఉన్నారంటే కారణం మన ముఖ్యమంత్రి, మన వ్యవసాయ శాఖ మంత్రి అని కొనియాడారు. రైతులకు రైతు బంధు, రైతు భీమా, సాగు నీరు, 24 గంటల విద్యుత్తు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని దానివల్ల రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయని వలస వెళ్లిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలియజేసారు.
స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు నాణ్యమైనవి, తక్కువ ధరకు ఇచ్చేవిధంగా ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ వస్తువులు కొనుగోలు చేయుటకు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సారుకులే కాకుండా రైతులకు కావాల్సిన పనిముట్లు, ఎరువులు, ఇతర మందులు సైతం లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. తిమ్మాజీపేట పి.ఏ.సి.ఎస్ మార్గదర్శకంగా నిలవాలని తదనుగూనంగా అభివరిద్ది చేయాలన్నారు. ఒకప్పుడు రైతులు కెరెంట్ లేదని సబ్స్టేషన్లు ముట్టడించడం, పంటలు ఎండిపోయాయని ధర్నాలు చేసేవారన్నారు. నేడు పంట పండించాం త్వరగా తీసుకెళ్లమని, లారీలు పంపమని ఫోన్ లు చేస్తారని అన్నారు. కర్వేన, వట్టేమ్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తన ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడి పి.ఏ.సి.ఎస్. మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
డి.సి.సి.బి చైర్మన్ నిజాం పాషా మాట్లాడుతూ పి.ఏ.సి.ఎస్ లకు కావాల్సిన సహకారం అందిస్తామని, 60 కోట్ల రూపాయలు పంట ఋణలుగా ఇచ్చేందుకు కేటాయించడం జరిగిందన్నారు. రైతులకు దీర్ఘ, స్వల్ప కాలిక రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.
తిమ్మాజీపేట మండల పి.ఏ.సి.ఎస్ చైర్మన్ జక్క రఘునందన్ మాట్లాడుతూ 5730 మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద సహకార సంఘం తిమ్మాజీపేటదని, సభ్యత్వం ఉన్న ప్రతి రైతుకు గుర్తింపు కార్డు ఇచ్చి పి.ఏ.సీఎస్. షాపింగ్ కాంప్లెక్స్ లో తక్కువ ధరకు నిత్యావసర వస్తువుల సరఫరా చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు సైతం తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడ ఒక పెట్రల్ బంకు సైతం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హన్మంత్ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ జి. కూర్మయ్య, డి.సి.ఓ పత్యనాయక్, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు,ఎంపిటిసి లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post