సవాయిగూడెం గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:4.9.2021, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శనివారం వనపర్తి జిల్లాలోని సవాయిగూడెం గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో, ప్రతి మండలానికి 10 ఎకరాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (MGNREGS), గ్రామీణ అభివృద్ధి (Rural Development) ద్వారా రూ.40 లక్షల వరకు నిధులు సమకూర్చడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు. ఒక యూనిట్ కు 31 వేల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అటవీశాఖ, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దాలని జిల్లా కలె క్టర్ అధికారులకు తెలిపారు. అంతకుముందు ఎకో పార్క్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ కార్యక్రమంలో డి.పి.ఓ. సురేష్ కుమార్, డీ.ఎఫ్.ఓ. రామకృష్ణ, డి.డబ్ల్యూ.ఓ. పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
…. …………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

 

 

Share This Post