సహకార సంస్థలు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయని  డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు.

సహకార సంస్థలు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయని
డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు.
68 వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం డీసీఎంస్ చైర్మన్ అధ్యక్షతన మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘము లిమిటెడ్,సంగారెడ్డి ప్రధాన కార్యాలయములో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 14నుండి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.  వారోత్సవాలలో భాగంగా షెడ్యూల్ మేరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు
  కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి టి. ప్రసాద్ , డీసీఎంఎస్ డైరెక్టర్ మాణయ్య,  డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఆంజనేయులు సహకార మార్కెటింగ్ సంఘాలను అభివృద్ధి పథంలో నడిపించుటకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలపై సలహాలు, సూచనలు చేశారు.
ఈ యొక్క కార్యక్రమం లో డీసీఎంఎస్ కార్యాలయ సిబ్బంది, జిల్లా సహకార కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Share This Post