సహజ ప్రసవాలపై వైద్య , ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సరిమాచాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*సహజ ప్రసవాలపై వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించాలి*

– ప్రభుత్వ ఆసుపత్రుల్లో నే వందశాతం సంస్థాగత ప్రసవాలు జరిగేలా చూడాలి

– గర్భిణీ పరీక్షలు, చెకప్ లు వందశాతం జరగాలి

– ఈ నెల 20 వ తేదీ లోపు ఈ- హెల్త్ ప్రొఫైల్ పూర్తయ్యేలా చూడాలి

– *జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*
——————————
ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేటు దవాఖానల్లో సైతం సీ-సెక్షన్లను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచడం పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలనీ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో నే వందశాతం సంస్థాగత ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.

గురువారం సాయంత్రం IDOC మీటింగ్ హల్ లో సహజ ప్రసవాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ హెల్త్ ప్రొఫైల్, గర్భిణుల నమోదు, ANC చెకప్ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా ANC రిజిస్ట్రేషన్ లు, చెకప్ లపై సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో ఇష్టారీతిన సిజేరియన్లు చేస్తున్నారనీ ఫలితంగా తల్లి, బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
దీన్ని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తరచూ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు.
సి – సెక్షన్లు నిర్వహించిన కేసులకు సంబంధించి రిపోర్ట్ ను ఆడిట్ చేయాలన్నారు.
అనవసరంగా సీజెరియన్ లు నిర్వహించే ప్రభుత్వ , ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

*యజ్ఞం మాదిరి ఈ- హెల్త్ ప్రొఫైల్ చేపట్టాలి*

ఈ- హెల్త్ ప్రొఫైల్ వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలని జిల్లా వైద్యాధికారి కి జిల్లా కలెక్టర్ సూచించారు.
మాస్ మూవ్మెంట్, యజ్ఞంలా చేపట్టి ఈ నెల 20 వ తేదీలోగా ఈ- హెల్త్ ప్రొఫైల్ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

*గర్భిణీ పరీక్షలు, చెకప్ లు వందశాతం జరగాలి*

జిల్లాలో వంద శాతం గర్భిణీ ల నమోదు,
ANC ( ANTI NATAL CHECK UP – గర్భిణీ పరీక్షలు) పరీక్షలు క్రమం తప్పకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యాధికారి తో పాటు స్టాఫ్ నర్స్ లు సైతం సహజ ప్రసవాలు జరిగేలా గర్భిణులు నమోదు, చెక ప్ వందశాతం జరిగేలా చూడాలన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే రోజే రక్త హీనత కేసుల పై దృష్టి సారించాలన్నారు. ఎనీమియా తో బాధపడుతున్న గర్భిణీలు మదర్ చైల్డ్ హెల్త్ కార్డులో డాట్ లను పూర్తి చెస్తున్నారో లేదో పరిశీలించాలని ఆన్నారు. జిల్లాను రక్త హీనత లేని జిల్లాగా తీర్చి దిద్దాలని సు సూచించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కు మెడికల్ కళాశాల మంజూరు చేసిన దృష్ట్యా నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్డిఓ శ్రీనివాసరావు ను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీ రాములు సిరిసిల్ల, వేములవాడ జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, డాక్టర్‌ మహేష్‌రావు, సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ మీనాక్షి,
ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. మహేష్, పీఓ లు డా. కపిల్, డా. శ్రీరాములు, డా. రాజశేఖర్, హెల్త్ ప్రొఫైల్ పీఓ లు నందిత, శ్రీధర్, హెచ్ఇ కార్తిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, స్టాఫ్ నర్స్ లు తదితరులు పాల్గొన్నారు.

——————————

Share This Post