సహాకార సంఘాల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది అని రైతంగానికి, గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడే వ్యవస్థ సహకార సంస్థ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

09 ఖమ్మం:

సహాకార సంఘాల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది అని రైతంగానికి, గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడే వ్యవస్థ సహకార సంస్థ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. బోనకల్ మండలం బొమ్మరంలో రూ 44 లక్షల వ్యయంతో నిర్మించిన గోదామును, షాపింగ్ కాంప్లెక్స్‌ను, అదేవిధంగా గోవిందాపురంలో నిర్మించిన 5 వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఎల్.ఎస్.సి. ఎస్. లక్ష్మీపురం గోదామును జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డి.సి.ఎం. ఎస్. చైర్మన్ రాయల శేషగిరిరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు తమ స్వంత కాళ్ళ పై నిలదొక్కుకునేందుకు అందుబాటులో ఉన్న వనరుల ద్వారా రైతాంగాన్ని ఆదుకొనే కార్యక్రమాలు చేపట్టాలని, మంత్రి అన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా సహకార సంఘాలు బలోపేతం కావాల్సి ఉందని, మార్కెటింగ్ ఆధ్వర్యంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మాణం చేసుకున్నామని రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా నిల్వలకు గోదాముల ఆవశ్యకత ఎంతైనా ఉందని, గోదాముల ఏర్పాటుతో పాటు, అనుబంధంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం డి.సి.సి.బి ద్వారా 12 కోట్ల లాభాన్ని ఆర్జించడం జరిగిందని మంత్రి తెలిపారు. గత రెండు సంవత్సరాలలో జిల్లాలో పి.ఏ.సి.ఎస్‌ల, గోదాముల, షాపింగ్ కాంప్లెక్స్్సల నిర్మాణం చేపట్టడంతో పాటు రుణాల రికవరీ మెరుగుపడిందని నష్టాల్లో ఉన్న బ్యాంకును ఈ సంవత్సరం 12 కోట్ల లాభాల్లో తేవడం జరిగిందని మంత్రి అన్నారు. రైతుల సంక్షేమం అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో గొప్ప పేరు కలిగిన వ్యవస్థ సహకార సంస్థ వ్యవస్థ అని సహాకార సంఘాల వ్యవస్థలు బాగున్నప్పుడే రైతులు ఆనందంగా ఉంటారని, అటు రైతులకు ఉపయోగపడే విధంగా సహకార సంఘాలు బలోపేతం కావాలని మంత్రి అన్నారు.

డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ డి.సి.సి.బి ద్వారా ఐదు వందల మంది రైతుల పిల్లలకు విదేశీ చదువుల నిమిత్తం 40 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. డి.సి.సి.బి ద్వారా కోళ్ళఫారాలు, హార్వేస్టర్లు, ట్రాక్టర్లు తదితర రైతుల అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకునే వారికి రుణాలు మంజూరు చేస్తామని, జిల్లాలోని పి.ఏ.సి.ఎస్. గోదాములను అవసరాలను బట్టి మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి విజయకుమారి, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, బోనకల్ ఎం.పి.పి కంకణాల సౌభాగ్యమ్మ, జడ్పీ టి.సి మోదుగు సుధీర్‌బాబు, సర్పంచ్ భూక్యా సైదానాయక్, ఎం.పి.టి.సి గుగులోతు రమేష్, డి.సి.సి.టి. సీ.ఈ.ఓ కె.వీరబాబు, పి.ఏ.సి.ఎస్ బోనకల్ సీ.ఈ.ఓ యం వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post