సహాయ ఓటరు నమోదు అధికారి టి నాగేశ్వరరావు ఘనంగా సన్మానించిన ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లు ,ఈఆర్వోలు, ఏ ఈ ఆర్ వో ల తో స్పెషల్ సమ్మరీ రివిజన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ డివిజన్ నందు గల నడిగూడెం మండల( ఏఈఆర్ఓ) సహాయ ఓటరు నమోదు అధికారి టి నాగేశ్వరరావు నడిగూడెం మండలంలో ఓటర్ కార్డుతో ఆధార్ కార్డును 100% అనుసంధానం చేసినందుకుగాను ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఘనంగా శాలువతో సన్మానించారు. రాష్ట్రంలోని ప్రతి సహాయ ఎన్నికల అధికారులు తమ పరిధిలోని ఓటర్ కార్డులను ఆధార్ కార్డుతో 100 శాతం అనుసంధానం చేయవలసిందిగా సీఈవో తెలిపారు. ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం , స్పెషల్ సమ్మరీ రివిజన్ సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న తీరును పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ను అభినందించారు.