సాంత్వన కలిగించేలా పాలియేటివ్ కేర్ సేవలను నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ప్రారంభించనున్న – రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఎవరూ లేని వ్యక్తులకు బాధ నుండి ఉపశమనం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి 6 పడకలతో అందుబాటులోకి రానున్న ఆలన,ఆదరణ సేవ కేంద్రం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఉదయ్ కుమార్
పాలియేటివ్ కేర్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగిస్తుంది.
20వ కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించి జిల్లాలో 6 బెడ్లతో అందుబాటులోకి తేనున్నారు.
పాలియేటివ్ కేర్ యూనిట్ లో వయోభారంతో పాటు ప్రాణాంతకమైన దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతూ కనీసం వారి పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారనన్నారు.
పక్షవాతం, కాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, మంచం మీద దీన స్థితిలో ఉన్న వ్యక్తులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.
చికిత్సలకు లొంగని వ్యాధులతో భాదపడుతున్న వారికి ధైర్యాన్ని కల్పించి అవగాహన కల్పిస్తారు. జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఈ కేంద్రంలోని సేవలు స్వాంతన చేకూర్చుతాయి.
నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు సహాయత చాలా అవసరము.
అలాంటివారిని
పాలియేటివ్ కేర్ కేంద్రంలో చేరి చికిత్సలు పొందే వ్యక్తులకు సహాయతగా ఉంటూ వారికి చికిత్సలు ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై 28 రోజులు రాష్ట్రస్థాయిలో సిబ్బందికి శిక్షణతో పాటు అవగాహన ఇదివరకే కల్పించారు.
దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం జిల్లాలో ఆదరణకు నోచుకోని ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది.
ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఈ పాలియేటివ్ కేర్ యూనిట్ సంజీవినిగా పని చేయనున్నది.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
ఆస్పత్రి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై వైద్యులతో చర్చించారు.
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం, డాక్టర్ రోహిత్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.