సాగు విస్తీర్ణం పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

పకడ్భందిగా సాగు విస్తీర్ణ వివరాలు నమోదు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి , డిసెంబర్ 04:- జిల్లాలో పకడ్భందిగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021 పంటకు సంబంధించి సాగు విస్తర్ణ వివరాల రికన్సిలేషన్ వ రిపోర్ట్ పై శనివారం కలెక్టరేట్ లోని తనతన చాంబర్లో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 286136 ఎకరాలలో వానాకాలం పంట సాగు జరిగిందని, వీటీలో 265030 ఎకరాలకు ప్రాజేక్టులు, చెరువులు, బోర్ల కింద సాగవుతుందని,21106 ఎకరాల్లో వర్షాధారిత ఆధారంగా సాగయ్యాయని అధికారులు తెలిపారు. వానాకాలంలో 211091 ఎకరాల్లో ధాన్యం, 63274 ఎకరాల్లో పత్తి, 5508 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు సాగు జరిగాయని వివరించారు. జిల్లాలో ఎస్ ఆర్ ఎస్ పి, లిఫ్ట్ ఇరిగేషన్ , ఇతర నీటి వనరుల కింద సాగిన భూముల వివరాలు మండలాలు , గ్రామాల వారీగా సరి చూసుకుని నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ముఖ్య ప్రణాళిక అధికారి జె. రవీందర్, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, గ్రౌండ్ వాటర్ అధికారి రవి శంకర్, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

Share This Post