సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా గర్భిణీ స్త్రీలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి మహిళా శిశు సంక్షేమ అధికారులకు సూచించారు.

శుక్రవారం నాడు భువనగిరి పట్టణంలోని ఇందిరా నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం సభ కార్యక్రమంలో భాగంగా ఆమె సందర్శించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ కూడా వెంట ఉన్నారు.

ఈ సందర్భంగా ఆమె గర్భిణీ స్త్రీల పట్ల తీసుకునే జాగ్రత్తలు, పిల్లల సంరక్షణ గురించి మాట్లాడుతూ, ప్రతి గర్భిణీ స్త్రీ తాను గర్భవతి అని తెలియగానే పేరు నమోదు చేసుకోవాలని, ప్రతి గర్భిణీ స్త్రీ పోషక ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే లాభాలను, తద్వారా బిడ్డ ఎదుగుదల తదితర విషయాల పట్ల అవగాహన కలిగించాలని తెలిపారు. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ తనకు తానుగానే సాధారణ ప్రసవానికి సంసిద్ధం అవ్వాలని కోరారు. గర్భిణీ స్త్రీలు ఐరన్ మాత్రలు తీసుకోవాలని, అలాగే ఆకు కూరలు, పుల్లటి పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ శోషణ చేసుకుంటుందని, విటమిన్ ఎ అధికంగా గల ఆకుకూరలను తీసుకోవాలని కోరారు. సిజేరియన్ ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ వలన తల్లి బిడ్డకు చాలా మేలు కలుగుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అవ్వడం ద్వారా కెసిఆర్ కిట్స్ పొందవచ్చునని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డల ఎదుగుదలను గమనించడం ద్వారా వారిలో కలిగే లోపాలను మొదటి దశలోనే గుర్తించి వాటిని సరిచేయుటకు వీలు కలుగుతుందని, ప్రతి తల్లి తండ్రి లోపాలను గుర్తించడంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం సభలో సిడిపిఓ స్వరాజ్యం, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, తల్లులు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా గర్భిణీ స్త్రీలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి మహిళా శిశు సంక్షేమ అధికారులకు సూచించారు.

Share This Post