సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,

సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,
0 0 0 0

     ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లను ఆదేశించారు

   శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేటు ఆసుపత్రుల స్త్రీ వైద్యనిపుణుల (డిజిఓఎస్) లతో నిర్వహించ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాదారణ ప్రసవాలు జరిగె విధంగా చూడాలని అన్నారు. జిల్లాలో ప్రధానంగా ప్రసవాలు ఎక్కువగా పెద్ద ఆపరేషన్ (సి సెక్షన్స్) జరుగుతున్నాయని సి- సెక్షన్స్ ప్రసవాలు జిల్లాలో అధికంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మొదటి కాన్పు వచ్చే వారిని సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవం అయ్యేల చూడాలని, జిల్లాలో తల్లి బిడ్డల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకోవాలని గర్బిణిగా ఉన్నప్పుడు రక్తహీనత లేకుండా ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇవ్వాలని ఆయన తెలిపారు.

     ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జుబెరియా , ప్రైవేట్ డాక్టర్లు , పట్టణంలోని స్త్రీ వైద్యనిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post