సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా కృషి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-3

తేదీ.6.5.2022

సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా కృషి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల మే 6:- జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపొందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత వైద్య అధికారులను, డాక్టర్లు ను సూచించారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంచెందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ ,ప్రైవేటు గైనకాలజిస్ట్ లతో రివ్యూ నిర్వహించారు.

ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందని, దురదృష్టవశాత్తు సీజెరియన్ ఆపరేషన్ లలో సైతం జగిత్యాల ముందు ఉందని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో 80%, ప్రైవేట్ ఆస్పత్రులు 94% సీజెరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోం లలో 100% సిజెరియన ప్రసవాలు మాత్రమే జరుగుతుండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. 100% సాధారణ ప్రసవాలు మాత్రమే జరగాలని తాము కోరడం లేదని, అదే సమయంలో అధికంగా సీజెరియన్ ఆపరేషన్ నిర్వహించడాన్ని సమర్దించమని కలెక్టర్ స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పసి పిల్లల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రసవించిన తర్వాత మొదటి గంట సమయంలో అందించే ముర్రె పాలు కీలక పాత్ర పోషిస్తాయని, అధికంగా సీజెరియన్ ఆపరేషన్ జర్గడం వల కేవలం 36% మాత్రమే పిల్లలకు ముర్రే పాలు అందుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, వీటిని వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. మూహుర్త ప్రసవాలు నిర్వహించమని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రసవాలకు ముహూర్తాలు పెట్టవద్దని బ్రాహ్మణులకు సైతం సూచిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇక పై ముహూర్తాల కోసం సీజెరియన్ ఆపరేషన్లు నిర్వహించడం నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కేవలం 30% మాత్రమే ప్రసవాలు జరిగాయని, ప్రస్తుతం 56% ప్రసవాలు ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రం కేవలం 44% ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.18 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక సామాగ్రి, యంత్రాల, మౌలిక సదుపాయాలతో 100 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఊహించుకుంటూ 6 మాసాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 60% ప్రసవాలు జరిగే విధంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు పై ప్రజలకు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బందిని వివరించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఇకపై జరిగే ప్రతి సీజెరియన్ ఆపరేషన్ సంబంధించి సమగ్ర వివరాలు, నివేదిక అదే రోజు సమర్పించాలని, ప్రతి రిపోర్ట్ ఆడిట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీధర్, ఐ. ఎం.ఏ. అధ్యక్షులు, డాక్టర్లు, సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

ప్రచురణార్థం----3  తేదీ.6.5.2022  సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా కృషి:: జిల్లా కలెక్టర్ జి.రవి  జగిత్యాల మే 6:-  జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపొందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత వైద్య అధికారులను, డాక్టర్లు ను సూచించారు.  జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంచెందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ ,ప్రైవేటు గైనకాలజిస్ట్ లతో రివ్యూ నిర్వహించారు.  ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందని, దురదృష్టవశాత్తు సీజెరియన్ ఆపరేషన్ లలో సైతం జగిత్యాల ముందు ఉందని తెలిపారు.  జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో 80%, ప్రైవేట్ ఆస్పత్రులు 94% సీజెరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోం లలో 100% సిజెరియన ప్రసవాలు మాత్రమే జరుగుతుండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు.  100% సాధారణ ప్రసవాలు మాత్రమే జరగాలని తాము కోరడం లేదని, అదే సమయంలో అధికంగా సీజెరియన్ ఆపరేషన్ నిర్వహించడాన్ని సమర్దించమని కలెక్టర్ స్పష్టం చేశారు.  గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  పసి పిల్లల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు  ప్రసవించిన తర్వాత మొదటి గంట సమయంలో అందించే ముర్రె పాలు కీలక పాత్ర పోషిస్తాయని, అధికంగా సీజెరియన్ ఆపరేషన్ జర్గడం వల కేవలం 36%  మాత్రమే  పిల్లలకు ముర్రే పాలు అందుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.   సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉన్నప్పటికీ  కొంతమంది ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, వీటిని వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. మూహుర్త ప్రసవాలు నిర్వహించమని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రసవాలకు ముహూర్తాలు పెట్టవద్దని బ్రాహ్మణులకు సైతం సూచిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇక పై ముహూర్తాల కోసం సీజెరియన్  ఆపరేషన్లు నిర్వహించడం  నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కేవలం 30% మాత్రమే ప్రసవాలు జరిగాయని, ప్రస్తుతం 56% ప్రసవాలు ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.   జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రం కేవలం 44% ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు.  ప్రభుత్వం రూ.18 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక సామాగ్రి, యంత్రాల, మౌలిక సదుపాయాలతో 100 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఊహించుకుంటూ 6 మాసాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 60% ప్రసవాలు జరిగే విధంగా పనిచేయాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు పై ప్రజలకు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బందిని వివరించాలని కలెక్టర్ సూచించారు.   జిల్లాలో ఇకపై జరిగే ప్రతి సీజెరియన్ ఆపరేషన్ సంబంధించి సమగ్ర వివరాలు, నివేదిక అదే రోజు సమర్పించాలని, ప్రతి రిపోర్ట్  ఆడిట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీధర్, ఐ. ఎం.ఏ. అధ్యక్షులు, డాక్టర్లు, సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు  జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా కృషి:: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post