సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపొందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సంబంధిత ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రభుత్వ వైద్య అధికారులను, డాక్టర్లు ను సూచించారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంచెందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ ,ప్రైవేటు గైనకాలజిస్ట్ లతో రివ్యూ నిర్వహించారు.
ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో నాగర్ కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందని, దురదృష్టవశాత్తు ప్రైవేటు ఆసుపత్రుల సీజెరియన్ ఆపరేషన్ లలో సైతం జిల్లా ముందు ఉందని తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో 40%, ప్రైవేట్ ఆస్పత్రులు 88% సీజెరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయని తెలిపారు.
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోం లలో 100% సిజెరియన ప్రసవాలు మాత్రమే జరుగుతుండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. 100% సాధారణ ప్రసవాలు మాత్రమే జరగాలని తాము కోరడం లేదని, అదే సమయంలో అధికంగా సీజెరియన్ ఆపరేషన్ నిర్వహించడాన్ని సమర్దించమని కలెక్టర్ స్పష్టం చేశారు.
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పసి పిల్లల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రసవించిన తర్వాత మొదటి గంట సమయంలో అందించే ముర్రె పాలు కీలక పాత్ర పోషిస్తాయని, అధికంగా సీజెరియన్ ఆపరేషన్ జర్గడం వల కేవలం 36% మాత్రమే పిల్లలకు ముర్రే పాలు అందుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని,ఇలాంటి వాటిని నిరోధించాలని అన్నారు.
జిల్లాలో 59% ప్రసవాలు ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రం కేవలం 59% ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కోన్ని కోట్లు ఖర్చు చేసి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల తో పాటు కొల్లాపూర్ లో అత్యాధునిక సామాగ్రి, యంత్రాల, మౌలిక సదుపాయాలతో 100 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఊహించుకుంటూ 6 మాసాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 80% ప్రసవాలు జరిగే విధంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు పై ప్రజలకు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బందిని వివరించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇకపై జరిగే ప్రతి సీజెరియన్ ఆపరేషన్ సంబంధించి సమగ్ర వివరాలు, నివేదిక అదే రోజు సమర్పించాలని, ప్రతి రిపోర్ట్ ఆడిట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రతి నెల నెల 5వ తేదీన క్వాలిటీ సర్వీస్ పై సమీక్ష ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
ఎనిమియా కేసులు జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికను అంగన్వాడీ కార్యకర్తల నివేదికలతో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.
కొన్ని మండలాల్లో ఎనీమియా కేసు లేనట్లు ప్రకటించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే సూపర్వైజర్ల పనితీరులో మార్పులు చేసుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
సూపర్వైజర్ల పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రగతి నర్సింగ్ హోమ్ నాగర్ కర్నూల్ లో 45 శాతం, సాయి కృప నర్సింగ్ హోమ్ కొల్లాపూర్ లో 46%, ప్రశాంతి నర్సింగ్ హోమ్ కొల్లాపూర్ లో 42% లో ఆదిత్య హాస్పిటల్ నాగర్ కర్నూల్ లో 41% సాధారణ ప్రసవాలతో ముందున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లను కలెక్టర్ అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు.
మిగతా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సూచించారు.
సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రైవేట్ వైద్యుల సూచనలు సలహాలను తీసుకున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, అదనపు డి ఎమ్ హెచ్ ఓ వెంకటదాసు, డాక్టర్ భరత్ రెడ్డి, ప్రైవేటు, ప్రభుత్వ డాక్టర్లు, సంబంధించిన అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post