సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి – సిజేరియన్ కాన్పులు తగ్గించాలి అంగన్వాడి, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి అసంక్రమిత వ్యాధుల సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల వ్యాక్సినేషన్ 15-18 వయస్సు గల వారికి  రెండవ డోస్ 100%  సాధించాలి : జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి – సిజేరియన్ కాన్పులు తగ్గించాలి

అంగన్వాడి, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి

అసంక్రమిత వ్యాధుల సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల వ్యాక్సినేషన్ 15-18 వయస్సు గల వారికి  రెండవ డోస్ 100%  సాధించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

              00000

 జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా మరియు సిజేరియన్ ప్రసవాలు తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వైద్యాధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు, పురోహితులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో  నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న శస్త్ర చికిత్సల  ప్రసవాలు ఎక్కువగా ముహూర్తాల ద్వారా జరుగుతున్నందున స్త్రీ, ప్రసూతి  వైద్య నిపుణులు,పురోహితులు  వాటిని తగ్గించుటకు  కృషి చేయాలన్నారు.  సాధారణ ప్రసవాలు ప్రోత్సహించడానికి మరియు శస్త్రచికిత్సలు ముహూర్తాల ద్వారా ప్రసవాలు  జరగకుండా పురోహితులు గర్భిణీలకు  అవగాహన కల్పిస్తామని వారు కలెక్టర్కు  హామీ ఇచ్చారు. తర్వాత సిజేరియన్ ప్రసవాల వల్ల కలిగే అనర్ధాలు మరియు సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాల గురించి వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్లను గైనకాలజిస్ట్ లతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు ఈ పోస్టర్లు అన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా హాజరైన గైనకాలజిస్టులు సిజేరియన్  ప్రసవాలను తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా లోని అందరూ వైద్య అధికారులతో అన్నీ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని కలెక్టర్.సమీక్షించారు. 12 వారాల లోపు గర్భిణీల నమోదు 100% నమోదు చేయాలని ఐఎఫ్ఏ మరియు క్యాల్షియం మాత్రలను గర్భిణీలకు  అందజేయాలని, అంగన్వాడి మరియు ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కలెక్టర్  ఆదేశించారు జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్ కాన్పులు తగ్గించి సాధారణ కాన్పులు పెంచాలని ఆదేశించారు. అసంక్రమిత వ్యాధులు సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల వ్యాక్సినేషన్ 15-18 సంవత్సరముల వయసు గల వారికి రెండవ డోసు 100% సాధించాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్,  పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

   ఈ సమావేశంలో అదనపు జిల్లా పాలనాధికారి గరిమా అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, DCHS రత్నమాల,  జిల్లా సమన్వయకర్త శివకృష్ణ, గైనకాలజిస్టులు, పురోహితులు వైద్యాధికారులు, సిడిపిఓలు  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post