సాధ్యమైనంత వరకు తక్కువ నష్టం తో జాతీయ రహదారికి మలుపులు తగ్గిస్తూ అలైన్మెంట్ చేసే విధంగా చూదాలని జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అధికారులను సూచించారు.

పత్రిక ప్రకటన
తేది: 3-9-2021
నాగర్ కర్నూల్ జిల్లా
సాధ్యమైనంత వరకు తక్కువ నష్టం తో జాతీయ రహదారికి మలుపులు తగ్గిస్తూ అలైన్మెంట్ చేసే విధంగా చూదాలని జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అధికారులను సూచించారు. శుక్రవారం ఉదయం చారగొండ మండల కేంద్రంలో కల్వకుర్తి – మల్లెపల్లి జాతీయ రహదారి 167 అలైన్మెంట్ పై గ్రామస్తుల అభ్యంతరాలను ఆలకించేందుకు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. శ్రీనివాస్ రెడ్డి, జాతీయ రహదారి అధికారులతో కలిసి జాతీయ రహదారి అలైన్మెంట్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జాతీయ రహదారి ఇంజనీర్లు గుర్తించిన అలైన్మెంట్ వల్ల దాదాపు 30 పైచిలుకు ఇళ్లు తొలగించాల్సి వస్తుందని దానితోపాటుగా మలుపు సైతం తొలగించే అవకాశం లేదన్నారు. దీనికి బదులుగా గ్రామస్తులు సూచిస్తున్నట్లు మరో అలైన్మెంట్ ను పరిశీలిస్తే కేవలం ఒకటి రెండు ఇళ్లు మాత్రమే తొలగించి మిగిలినది ఖాళీ ప్లాట్ల గుండా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఇళ్లు సైతం తక్కువ కోల్పోయే అవకాశం ఉందని తద్వారా పరిహారం తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల అలైన్మెంట్ లను పరిశీలించాల్సిందిగా అధికారులను సూచించారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు నష్టం చేకూర్చాలనేది ప్రభుత్వ అభిమతం కాదని, జాతీయ రహదారి ఇంజనీర్లు రెండు మూడు రకాలుగా రూపొందించిన అలైన్మెంట్ లను పరిశీలించి ప్రజల ఆమోదంతో పాటు భవిష్యత్తులో జాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించే విధంగా తగిన అలైన్మెంట్ కు అనుగుణంగా భూసేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. భూసేకరణలో సైతం ఇళ్లు కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అంతకుముందు కలెక్టర్ బి.సి కమిషన్ సభ్యులకు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జాతీయ రహదారి ఇంజనీర్లు, ఆర్ డిఓ కల్వకుర్తి రాజేష్ కుమార్, జిల్లా బి.సి సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, ఏబీసిడిఓ శ్రీధర్ జీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
—————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూలు ద్వారా జారీ.

Share This Post