సాఫ్ట్బాల్ విజేతలకు సన్మానం

జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల లో పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్ సన్మానించి అభినందించారు.

ఈనెల 19 నుంచి 23 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో జరిగిన 33 వ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ జాతీయ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున
1) S. సౌమ్య రాణి,
2) L. రాణి,
3) K. సృజన,
4) G. సౌందర్య లు

పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బంగారు పథకాలు అందుకున్న సందర్భంగా క్రీడాకారులను అడిషనల్ కలెక్టర్లు, చిత్ర మిశ్రా చంద్రశేఖర్ క్రీడాకారులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ప్రభాకర్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి M. గంగా మోహన్ ,సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీమతి మేరీ ఏసుపాదం, సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి ప్రిన్సిపాల్ శ్రీమతి గోదావరి గారు, sports కో ఆర్డినేటర్ నీరజారెడ్డి గారు, సుద్ధపల్లి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నల్లూరి లత, సాఫ్ట్బాల్ సంఘ సంయుక్త కార్యదర్శులు నవీన్, కె నరేంద్ర చారి ,వినోద్,మరియు జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ మరియు డి ఎస్ ఏ సురేష్ లు పాల్గొన్నారు

Share This Post