సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు వైద్యం మరియు పౌష్టికాహార కల్పన రంగాలలో సహకరించడానికి ఈసీఐఎల్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 7 (మంగళవారం).

సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు వైద్యం మరియు పౌష్టికాహార కల్పన రంగాలలో సహకరించడానికి ఈసీఐఎల్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లందు క్లబ్ హౌస్ లో ఈసీఐఎల్ సంస్థవారు పాఠశాల విద్యార్థులు, చిన్నారులు, బాలింతలతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మరియు స్థానిక శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డిల చేతుల మీదుగా అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్ ను, 6 సంవత్సరాలలోపు చిన్నారులకు బాలామృతం, 6 నుండి 15 సంవత్సరాలలోపు పాఠశాలల విద్యార్థులకు పాలు అందించారు.

ఈ సందర్భంగా ఈసీఐఎల్ సంస్థ జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్) ఏ. మాల్ వియ(malviya) మాట్లాడుతూ దేశ రక్షణ, ఎన్నికలు, అంతరిక్షం తదితర రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా సామాజిక బాధ్యతగా వైద్యం మరియు పౌష్టికాహార కల్పనకు ఈసీఐఎల్ సంస్థ ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిందని అందులో భాగంగా ఆస్పీరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం ద్వారా జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 35 లక్షల రూపాయల విలువైన ఆంబులెన్స్ ను అందిస్తున్నామని మరియు 72 లక్షల రూపాయల విలువైన పాలను నేషనల్ డైరీ బోర్డు ద్వారా అందిస్తున్నామని, 6 సంవత్సరాల లోపు చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు 10 లక్షల రూపాయల విలువైన పౌష్టికాహారాన్ని జిల్లా అధికార యంత్రాంగం మరియు ఐటీడీఏ ఏటూరునాగారం సహకారంతో అందించనున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మరియు స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డిలు మాట్లాడుతూ నీతి అయోగ్ చే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడిన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి,ములుగు జిల్లాలలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా ఈసీఐఎల్ వైద్య ఆరోగ్యం మరియు పౌష్టికాహార కల్పనకు ముందుకు రావడం అభినందనీయమని వారు అందించే సహకారంతో అత్యవసర వైద్య సేవల కొరకు అంబులెన్స్ ను, మారుమూల ప్రాంతాలలో పాఠశాల విద్యార్థులకు పాలను, చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు బాలామృతం సమర్థవంతంగా అందించి జిల్లాలో వైద్య ఆరోగ్యం మరియు పౌష్టికాహార కల్పన రంగాలలో జిల్లా ప్రజలు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మరియు ఇన్చార్జి డిడబ్ల్యుఓ శామ్యూల్, ములుగు డిడబ్ల్యూ ప్రేమలత, జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాల డిఇఓలు అబ్దుల్ హై, వాసంతిలు, సిడిపిఓలు రాధిక, అవంతిక బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ శిరీష, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ మేనేజర్ జయకృష్ణ, ఈసీఐఎల్ ఏజీఎం మురళి కృష్ణ, ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అధికారులు భవానీశంకర్, దుర్గాప్రసాద్, సునీల్ కుమార్, భాస్కర్ రెడ్డి, ప్రసాద్, బీహారి ప్రసాద్, కరుణానిధి, చిన్నారులు, బాలింతలు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది

Share This Post