సామాన్య ప్రజలకు అందుబాటులో బ్యాంక్ సేవలు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

జనగామ, అక్టోబర్ 22: సామాన్య ప్రజలకు అందుబాటులో బ్యాంక్ సేవలు అందించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో స్టేట్ లెవల్ బ్యాంక్ కమిటీ వారి ఆదేశానుసారం రుణ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు ఈ రుణ మేళాలో మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భారతీయ సేట్ బ్యాంక్ 10కోట్లు, యూనియన్ బ్యాంక్ 3కోట్లు, వరంగల్ అర్బన్ బ్యాంక్ 2కోట్ల 50 లక్షలు మంజూరు చేసారు.ఇతర రుణాలను హెచ్ డి ఎఫ్ సి నుండి ట్రాక్టర్, ఎస్బిఐ నుండి గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేసామన్నారు. ఈ రుణ మేళాలో 16 బ్యాంక్ ల కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి అర్హత కలిగిన వారికి వెంటనే రుణాలు మంజూరు చేశామన్నారు. ఈ రుణ మేళాలో స్థానిక ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టివి.శ్రీనివాస్ రావు, డిఆర్డిఎ. జి. రాంరెడ్డి,జీఎం.డిఐసి రమేష్, ఎస్సీ, బిసి సంక్షేమ శాఖ అధికారులు ,ఎస్బిఐ డిజిఎం.నటరాజ్, ఎజిఎం. అలింఉద్దిన్, యూబిఐ. ఏజిఎం.హరిరామ్, ఎపిజీవిబి ఆర్ ఎం. విజయ్ భాస్కర్, డిసిసి డిజిఎం, అశోక్ కుమార్, క్లస్టర్ హెడ్ టి. ప్రసాద్,సిబిఐ పంకజ్ కుమార్, ఎపిడి నూరొద్దిన్, బ్యాంక్ అధికారులు ప్రజలు అధిక సంఖ్య పాల్గొన్నారు.

Share This Post