సామాన్య ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి:: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ గౌరవ సభ్య కార్యదర్శి శ్రీమతి వై. రేణుక

జనగామ నవంబర్ 02 :
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, (నాల్సా) ఆదేశాల అనుసారం “పాన్ ఇండియా అవేర్నెస్, ఔట్రీచ్ క్యాంపెయిన్” కార్యక్రమాలలో భాగంగా తేది:02.11.2021 మంగళవారం రోజున ఉదయం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ సమావేశానికి గౌరవ సభ్య కార్యదర్శి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్, తెలంగాణ. శ్రీమతి యార.రేణుక గారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గౌరవ సభ్య కార్యదర్శి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ శ్రీమతి యార.రేణుక గారు మాట్లాడుతూ “జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ, 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించతలపెట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నాల్సా వారి సూచనల మేరకు అక్టోబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 14వ తేదీ వరకు అనగా 43 రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాల, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగామ మరియు మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలతో సహా మొత్తం 1688 గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించాలని, తద్వారా ప్రజలకు న్యాయ సేవ అధికార సంస్థల ద్వారా అవసరాలను, న్యాయసేవాధికార సంస్థ లక్ష్యాలను తెలియజేయాలనే ఉద్దేశం గా పేర్కొన్నారు. ప్రజలకు న్యాయపరంగా ప్రభుత్వం కల్పించే వివిధ సంక్షేమ పథకాలు అందడం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా న్యాయ సేవ అధికార సంస్థలు కృషి చేస్తాయని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారుల వల్లనే ప్రజలకు న్యాయం జరిగేలా సహకరించవచ్చునని ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ప్రతీ గ్రామాన్ని సందర్శించి, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని, ఆ సమస్యల పరిష్కార మార్గాలను వారికి సూచించాలని, చట్టాల గురించి అందరికీ తెలియజేయాలని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థల ముఖ్య ఉద్దేశాలయిన ఉచిత న్యాయ సహాయం, చట్టం దృష్టిలో అందరూ సమానులే, లోక్ అదాలత్ మొదలగు నినాదాలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులను విజయవంతం చేయుటకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు లలో పట్టణ మరియు గ్రామీణ ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే నిస్సంకోచంగా న్యాయసేవాధికార సంస్థ లకు తెలియజేయవచ్చునని తెలిపారు. న్యాయ సేవ అధికార సంస్థలు ఆ సమస్యలను పరిష్కరించుటకు లేదా పరిష్కార దిశగా సరైన మార్గాలను సూచిస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఇప్పటికే వివిధ ప్రాంతాల వారిగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో విజ్ఞాన సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలు ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగ పరచుకుని, వారి వారి సమస్యల నుండి విముక్తి పొందవలసినదిగా విజ్ఞప్తి చేశారు.
కావున ప్రభుత్వ అధికారులు న్యాయ సేవాధికార సంస్థల పథకాలు అయిన victims of trafficking and commercial exploitation scheme,
legal services to the workers in the unorganized sector scheme,
child friendly legal services to children and their protection scheme
efective implementation of poverty alleviation scheme protection and enforcement of tribal rights scheme,
senior citizens scheme
మరియు
telangana victim compensation scheme ల గురించి ప్రజలకు తమవంతుగా అవగాహన కల్పించి, ప్రజలు లబ్ధి పొందేలా సహాయపడాలని ప్రభుత్వ అధికారులకు ఈ సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ ద్వారా వేడుకుంటున్నామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, వివిధ శాఖల లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరే విధంగా జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు చేపడతామని, కర పత్రాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి న్యాయ సేవా సంస్థ (లీగల్ సెల్) ను సామాన్యులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిసిపి బి. శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు. జెడ్పీ సీఈవో ఎల్. విజయ లక్ష్మి, డిపిఓ రంగాచారి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డీఈఓ కె. రాము, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి సిహెచ్. ఉమారాణి, సిపిఓ ఎస్డి. ఇస్మాయిల్, డిఎఓ టి. రాధిక, డిఎస్ఓ రోజారాణి, ఏపిడి. నురొద్దిన్, బిసి సంక్షేమ అధికారి రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

Share This Post