సామూహిక టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
జనగామ, సెప్టెంబర్ 15: నేటి నుండి చేపట్టే సామూహిక టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, వార్డ్ ప్రత్యేక అధికారులు, ఎంపీవోలతో సామూహిక టీకా కార్యక్రమ సన్నద్ధతపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుండి జిల్లాలో సామూహిక టీకా కార్యక్రమాన్ని సబ్ సెంటర్ల హెడ్ క్వార్టర్స్, జనగామలోని 1 నుండి 15 వార్డుల్లో చేపడుతున్నట్లు తెలిపారు. సామూహిక టీకా కార్యక్రమంతోపాటు, డోర్ టు డోర్ సర్వే నిర్వహించి, ప్రతి ఇంటిలో ఎంత మంది 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఉన్నది, ఎంత మంది వ్యాక్సినేషన్ తీసుకుంది, ఎంత మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంది వివరాల స్టిక్కర్ ని అంటించాలని ఆయన అన్నారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, 16 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 104 సబ్ సెంటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏఎన్ఎంలతో వ్యాక్సినేషన్, ఆశ, అంగన్వాడీ టీచర్లు, సిసిలతో సర్వే ప్రక్రియ చేపట్టాలన్నారు. కనీస మౌళిక సదుపాయాలు టాయిలెట్, విద్యుత్ సౌకర్యం ఉన్న పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాలు, గుర్తించాలని, త్రాగునీరు, వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజన సదుపాయాలు చూడాలని ఆయన అన్నారు. అవసరమైతే రైతు వేదికను ఉపయోగించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ప్రయోజనాలను వివరించి, అవగాహన కల్పించి, నచ్చజెప్పాలని, ఎవరిని బలవంతపెట్టకూడదని ఆయన తెలిపారు. రోజువారీ వ్యాక్సినేషన్, సర్వే ప్రక్రియ పై నివేదిక సమర్పించాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వివరాలు ముందస్తుగా టాం టాం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ ఉదయం 9 గంటల నుండి ప్రారంభించాలని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ కేంద్రం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సామూహిక టీకా కార్యక్రమ పురోగతిపై ప్రతిరోజు టెలీ కాన్ఫరెన్స్ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అనంతరం రాష్ట్రంలో 2కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్బంగా కలెక్టర్ కేక్ కోసి, అధికారులతో సంబురాలు జరుపుతున్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డిపివో రంగాచారి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.