సారంగపూర్ మద్యంషాపు నిర్వహణకు డ్రా తీసిన జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..2 తేదిః 30-11-2021
సారంగపూర్ మద్యంషాపు నిర్వహణకు డ్రా తీసిన జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 30: ఈ నెల 20వ తేదిన2021-2023 సం.నికి గాను జిల్లాలోని 71 మద్యం షాపుల నిర్వహణకు డ్రా కార్యక్రమాన్ని నిర్వహించగా, గెజిట్ నెం. JGTL043, సారంగపూర్ గ్రామం, మండలం నుండి కేవలం 6 ధరఖాస్తులు మాత్రమే రాగా, ఈ నెల 26 నుండి 29వ తేది వరకు రీ నోటిఫికేషన్ జారిచేసి, ఆశావాహుల నుండి కొత్తగా 8 ధరఖాస్తులను స్వీకరించడం జరిగింది. మొత్తంగా వచ్చిన 14 ధరఖాస్తులకు ఈరోజు (30.11.2021) ఉదయం జిల్లా కేంద్రంలో ఐఎంఏ హాలులో జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో డ్రా కార్యక్రమాన్ని నిర్వహించగా లక్కీ డ్రా ద్వారా కొండాపూర్ గ్రామానికి చెందిన సుదబోయిన లక్ష్మీ గౌడ్ మద్యం దుఖాన నిర్వహాణకు ఎంపికయినట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

సారంగపూర్ మద్యంషాపు నిర్వహణకు డ్రా తీసిన జిల్లా కలెక్టర్ జి. రవి

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీధర్, ఎక్సైజ్ అధికారులు, 14 మంది అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post